జైల్లో అల్లు అర్జున్‌కు నరకం! భోజనం చేయకుండా నేలపై నిద్ర

జైల్లో అల్లు అర్జున్‌కు నరకం! భోజనం చేయకుండా నేలపై నిద్ర

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఒక రాత్రి చంచల్‌గూడ జైలులో గడిపారు. జైలులో ఆయనకు భోజనం లేకపోవడంతో పాటు, నేలపై నిద్రపోవాల్సి వచ్చింది. నిన్న రాత్రి జైలులో అల్లు అర్జున్‌కు 7697 అనే ఖైదీ నంబర్ కేటాయించారని సమాచారం. రాత్రి 10 గంటల వరకు రిసెప్షన్‌లో ఉండగా, ఆ తర్వాత మంజీరా బ్యారక్‌లోకి తరలించారు. బెయిల్ ప్ర‌క్రియ ఆల‌స్యం కావ‌డంతో ఇవాళ ఉద‌యం అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు. జైలు నుంచి బ‌న్నీ నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాల‌యానికి వ‌చ్చారు. మ‌రికాసేప‌ట్లో ఇంటికి వెళ్ల‌నున్నారు.

అల్లు అర్జున్‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు వెంట‌నే విడుద‌ల చేయాల‌ని ఆదేశించిన‌ప్ప‌టికీ చంచ‌ల్‌గూడ జైలు అధికారులు మాత్రం రిలీజ్‌లో జాప్యం చేశార‌ని, రాత్రంతా ఆయ‌న్ను జైల్లోనే ఉంచార‌ని బ‌న్నీ త‌ర‌ఫు లాయ‌ర్ ఆరోపిస్తున్నారు. మ‌ధ్యంత‌ర బెయిల్ వ‌చ్చినా రాత్రంతా జైల్లోనే ఉంచార‌ని, జైలు అధికారుల‌పై అల్లు అర్జున్ త‌ర‌ఫు లాయ‌ర్ కోర్టు ధిక్క‌ర‌ణ కేసు వేసే అవ‌కాశం ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment