‘పెద్ది’ నుంచి ‘చికిరి’ మెలోడీ విడుదల

'పెద్ది' నుంచి 'చికిరి' విడుదల

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ‘ఉప్పెన’ ఫేమ్ యువ సంచలనం బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ నుంచి అభిమానులను ఉర్రూతలూగించే అప్‌డేట్ విడుదలైంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ గ్రామీణ నేపథ్యం గల స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలోని మొదటి పాటగా ‘చికిరి’ (Chikiri Chikiri) అనే రొమాంటిక్ మెలోడీని రిలీజ్ చేసిన చిత్ర బృందం. ఈ పాటకు ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందించగా, ప్రముఖ బాలీవుడ్ గాయకుడు మోహిత్ చౌహాన్ ఆలపించారు.

ఈ స్పెషల్ సాంగ్‌కు స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నృత్యాలను సమకూర్చారు. ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ, కాటుక, అలంకరణతో పనిలేకుండా సహజంగా అందంగా ఉండే అమ్మాయిని తమ ప్రాంతంలో ‘చికిరి’ అని పిలుచుకుంటారని, ఈ పాట రామ్ చరణ్, జాన్వీ కపూర్ (‘అచ్చియమ్మ’ పాత్ర) మధ్య తొలి ప్రేమ అనుభూతిని తెలియజేస్తుందని వివరించారు.

జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంతో కూడిన భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మార్చి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment