కాశీబుగ్గ‌లో తొక్కిసలాట.. ఏడుగురు భ‌క్తులు మృతి (Videos)

కాశీబుగ్గ‌లో తొక్కిసలాట.. ఏడుగురు భ‌క్తులు మృతి (Videos)

తిరుమ‌ల (Tirumala) వైకుంఠ ఏకాద‌శి (Vaikuntha Ekadashi) సంద‌ర్భంగా జ‌రిగిన‌ దుర్ఘ‌ట‌న‌, సింహాచలం (Simhachalam) అప్పన్న ఆలయం (Appanna Temple)లో ఘోర ప్రమాదాన్ని మ‌రువ‌క‌ముందే.. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ‌లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం తొక్కిసలాట జరిగింది.

ఈ ఘోర ఘ‌ట‌న‌లో ఏడుగురు భ‌క్తులు (Seven Devotees) అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు (Died). ప‌లువురికి గాయాలు కాగా, వారిని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ఈ ఘోర తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లిరావ‌డం, ఆల‌యంలో ఎలాంటి భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేయ‌క‌పోవ‌డమే ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని స్థానిక స‌మాచారం. శ్రీకాకుళం జిల్లాకు చెందిన హరిముకుంద పండా ప‌దేళ్ల క్రితం రూ.10 కోట్లతో 12 ఎకరాల్లో కాశీబుగ్గ‌లో వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆలయం నిర్మించారు.

ఈ ప్ర‌మాదంలో గాయపడిన భక్తులను వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలంలో రెస్క్యూ చర్యలు కొనసాగుతుండగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. స్థానిక ప్రజలు, భక్తులు ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

Join WhatsApp

Join Now

Leave a Comment