తన ప్రవచనాలతో జనంలో చైతన్యం తీసుకురావాల్సిన ఓ ప్రసిద్ధ ప్రవచనకర్త తన అసభ్యకర ప్రవర్తనతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డి సంచలనంగా మారారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ (Raipur)లో చోటుచేసుకున్న ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. టిక్రాపార ప్రాంతంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త భాస్కరాచార్య (Bhaskaracharya) ఒక వివాహిత మహిళ రీనా గుప్తా (Reena Gupta)తో కారులో సన్నిహితంగా ఉండగా ఆమె భర్త అనిల్ (Anil) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.
తన భార్య మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండడం చూసి కోపంతో ఊగిపోయిన భర్త, స్థానికులను పిలిచి ప్రవచనకర్తపై దాడి చేశాడు. అతని జుట్టు కత్తిరించి అవమానించాడు. ఆ సందర్భంలో ఆ మహిళను కూడా తీవ్రంగా గద్దించాడు. చివరికి ఆమెను “ఇప్పుడు నీకు కావలసింది ఇతడే కదా, అయితే ఇతనితోనే వెళ్లిపో” అంటూ ఫైరయ్యాడు.
వైరల్ అయిన వీడియో
ఈ ఘటనను అక్కడే ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో, వీడియో క్షణాల్లో వైరల్ అయింది. ఇప్పటివరకు ఆధ్యాత్మిక ప్రసంగాల ద్వారా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న భాస్కరాచార్య, ఈ వివాదంతో తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాడు. అనుచరులు షాక్‌కు గురవ్వగా, ప్రజలంతా ఆయన ప్రవర్తన తీరును ప్రశ్నిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.





 



