రెండు రోజుల క్రితం హరీష్‌రావు (Harish Rao) తండ్రి (Father) సత్యనారాయణరావు (Satyanarayana Rao) మృతి చెందిన విషయం తెలిసిందే. సత్యనారాయణరావు అంత్యక్రియలకు (Funeral rites) కవిత హాజరు కాకపోవడంతో, వారికి మధ్య ఉన్న విభేదాల కారణంగానే రాలేదంటూ రాజకీయ వర్గాలలో అనేక ఊహాగానాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో, మూడు రోజుల విరామం తర్వాత గురువారం ఉదయం కవిత(Kavitha) హరీష్‌రావు ఇంటికి వెళ్లారు. అక్కడ ఆమె కుటుంబ సభ్యులను కలుసుకుని, సత్యనారాయణరావు మృతి పట్ల విచారం వ్యక్తం చేసి, కాసేపు వారితో మాట్లాడి ధైర్యం చెప్పినట్లు సమాచారం.
అయితే, ఈ పరామర్శకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. గతంలో కవిత, మాజీ మంత్రి హరీష్‌రావుపై సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా, కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) అవినీతి (Corruption) వ్యవహారంలో హరీష్‌రావును ఉద్దేశిస్తూ ఆమె పరోక్షంగా మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై హరీష్‌రావు తాను ఉద్యమం నుంచి ఉన్నానని, తన ప్రస్థానం తెరిచిన పుస్తకమంటూ పరోక్షంగా సమాధానమిచ్చారు. ఆ తీవ్ర ఆరోపణల అనంతరం కవిత హరీష్‌రావు ఇంటికి వెళ్లడం ఇదే తొలిసారి కావడంతో, ఈ తాజా పరిణామం బీఆర్ఎస్(BRS) మరియు జాగృతి (Jagruthi) శ్రేణుల్లో ఆసక్తిని రేకెత్తించింది, అంతర్గత విభేదాలు సమసిపోతున్నాయనే సంకేతాలు వెలువడుతున్నట్లు చర్చ జరుగుతోంది.





 



