గుకేశ్ గురించి చంద్రబాబు ట్వీట్.. తెలుగు vs తమిళ నెటిజన్ల మాటల యుద్ధం

గుకేశ్ గురించి చంద్రబాబు ట్వీట్.. తెలుగు vs తమిళ నెటిజన్ల మాటల యుద్ధం

వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజుపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు చేసిన ట్వీట్ కొత్త వివాదానికి దారితీసింది. గుకేశ్‌ను తెలుగువాడిగా పేర్కొంటూ చేసిన ట్వీట్‌కు తమిళ నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. “గుకేశ్ తమిళుడే కానీ, తెలుగువాడు కాదు” అని కామెంట్లు చేస్తున్నారు.

తెలుగువాళ్ల కౌంటర్
తమిళ నెటిజన్ల వ్యాఖ్యలకు తెలుగువాళ్లు కౌంటర్ ఇస్తూ గుకేశ్ వికీపీడియా వివరాలను షేర్ చేస్తూ “ఆయన చెన్నైకి చెందిన తెలుగువాడు” అని స్పష్టం చేస్తున్నారు.

నెటిజన్ల మధ్య మాటల యుద్ధం
సీఎం చంద్రబాబు చేసిన ట్వీట్ కింద తెలుగు-తమిళ నెటిజన్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలుగు నెటిజన్లు గుకేశ్ తమవాడేనని వాదిస్తుండగా, తమిళ నెటిజన్లు అతను తమిళుడే అని చెబుతున్నారు. ఏది నిజమో కానీ, నెటిజన్ల మధ్య వివాదం మాత్రం తారా స్థాయిలో కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment