‘వీరసింహ రెడ్డి’ వంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni), నందమూరి బాలకృష్ణతో మరో ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. బాలయ్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, పాన్ ఇండియా స్థాయిలో ఊర మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందించాలని గోపీచంద్ మలినేని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు (Satish Kilaru) నిర్మిస్తున్నారు. ‘అఖండ 2’ పూర్తైన తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు టాలీవుడ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించబోతున్నారు.
ఈ భారీ ప్రాజెక్టులో బాలయ్య (Balayya) సరసన హీరోయిన్గా లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara)ను ఫైనల్ చేసినట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘శ్రీరామరాజ్యం’, ‘జై సింహ’ వంటి చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. దర్శకుడు గోపీచంద్ మలినేని చెప్పిన కథ నచ్చడంతో నయన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్న ఈ సినిమా నవంబర్ 7న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. బాలయ్య – నయనతార హ్యాట్రిక్ హిట్ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.







