రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘స్పిరిట్’.(‘Spirit’) దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్న వంగా, ప్రభాస్ ‘ఫౌజీ’, ‘రాజా సాబ్’ షూటింగ్‌లు పూర్తి కాగానే వీలైనంత త్వరగా ‘స్పిరిట్’ను సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారిగా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా, ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ‘స్పిరిట్’ నుంచి క్రేజీ అప్‌డేట్‌ను విడుదల చేసి అభిమానులకు సాలిడ్ ట్రీట్ ఇచ్చారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన ఆడియో గ్లిమ్స్‌లో ప్రభాస్ వాయిస్‌తో “మిస్టర్ సూపరిండేంట్… చిన్నప్పటి నుండి నాకు ఒక చిన్న బ్యాడ్ హ్యబిట్ ఉంది, ‘OneBadHabit'” అనే డైలాగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్‌గా కనిపించనున్నారు. ప్రకాష్ రాజ్, ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ కాంచన వంటి నటీనటులు కూడా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ‘భద్రకాళి పిక్చర్స్’, ‘టీ సిరీస్’ సంస్థలు సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.







