తుని బాలికపై అత్యాచార నిందితుడు ఆత్మ‌హ‌త్య‌ (Video)

తుని బాలికపై అత్యాచార నిందితుడు ఆత్మ‌హ‌త్య‌

తుని (Tuni) పట్టణంలో కలకలం రేపిన మైనర్ బాలిక (Minor Girl) అత్యాచారం కేసులో నిందితుడైన అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు తాటిక నారాయణరావు (Thatika Narayana Rao) ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. పోలీసుల అదుపులో ఉన్న నారాయణరావు, తుని రూరల్ పోలీస్ స్టేషన్ నుండి రిమాండ్ కోసం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేందుకు తీసుకువెళ్తుండగా, మార్గమధ్యంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బాలిక‌పై అత్యాచారం కేసులో నిందితుడు నారాయ‌ణ‌రావును నిన్న సాయంత్రం 5 గంట‌ల‌కు అరెస్ట్ చేశారు. ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసిన త‌రువాత మెజిస్ట్రేట్ ఎదుట హాజ‌రుప‌రిచేందుకు రాత్రి 10 గంట‌ల‌కు తుని పీఎస్ నుంచి పోలీసులు త‌మ వాహ‌నంలో నారాయ‌ణ‌రావును తీసుకొని బ‌య‌ల్దేరారు. మార్గ‌మ‌ధ్య‌లో కోమట్ల చెరువు వద్ద మూత్ర విసర్జన వస్తుందని చెప్పి వాహనం దిగాడు. ఇంత‌లో వ‌ర్షం ప‌డుతుండ‌డంతో పోలీసులు నారాయ‌ణ‌రావు నుంచి కొంత దూరం వ‌చ్చారు. క్షణాల్లోనే నిందితుడు చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే పోలీసులు, స్థానిక ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు అనంత‌రం నారాయణరావు మృతదేహం లభ్యమైంది అని పోలీసులు తెలిపారు.

పోలీసుల అదుపులో ఉండ‌గానే నారాయ‌ణ‌రావు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థినిపై నారాయణరావు అసభ్యంగా ప్రవర్తించిన వీడియో వైరల్ కావడంతో పెద్ద కలకలం రేపింది. ఈ కేసులో నిందితుడైన నారాయణరావు జీవితం చెరువులో ముగియడంతో కేసు కొత్త మలుపు తిరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment