దీపావళి పండగ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఒకేసారి 22.23 లక్షలకుపైగా దీపాలు వెలిగించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. ఈ ఘనతతో నగరం పేరు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కానీ, ఆ తరువాత జరిగిన సంఘటన అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
అయితే, ఈ వేడుకల తర్వాత బయటపడిన ఒక వీడియో మాత్రం అందరినీ ఆలోచనలో పడేసింది. దీపోత్సవం ముగిసిన తరువాత దీపాల్లో మిగిలిపోయిన నూనెను బాటిళ్లలో నింపుకుంటున్న స్థానికుల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
“దీపాల వెలుగు ప్రపంచ రికార్డు సాధించింది, కానీ పేదల ఇళ్లు మాత్రం ఇంకా చీకట్లోనే ఉన్నాయి” అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీపాల పండగ వెనుక ఉన్న ఈ విరుద్ధ వాస్తవం, సమాజంలో ఉన్న అసమానతల్ని మళ్లీ గుర్తు చేసింది.
अयोध्या में दीपोत्सव के बाद के यह वह दृश्य हैं, जिन्हें दिखाया नहीं गया।
— AAP (@AamAadmiParty) October 21, 2025
यह दृश्य उन दावों की हकीकत बताते हैं, जिसमें BJP सरकार महंगाई कम करने और करोड़ों परिवारों को गरीबी से निकालने की बात करती है। pic.twitter.com/rzxh1Z5yLW







