మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) ఇటీవల ‘గని’, ‘గాండీవధారి అర్జున’ వంటి పరాజయాల తర్వాత కొత్త కథలపై దృష్టి పెట్టాడు. ప్రస్తుతం మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ చిత్రం “కొరియన్ కనకరాజు”(Korean Kanakaraju) షూటింగ్ 80 శాతం పూర్తయింది.
ఈ ప్రాజెక్ట్ తర్వాత, వరుణ్ తేజ్ తన తదుపరి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అది విక్రమ్ సిరికొండ (Vikram Sirikonda) దర్శకత్వంలో రూపొందనున్న ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్. గత ఏడాదే ఓకే అయిన ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ చర్చల కారణంగా ఆలస్యమైంది.
ప్రస్తుతం అన్ని సన్నద్ధం కావడంతో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం కానుంది. ప్రేమ కథ, బలమైన ఎమోషన్స్, స్టైలిష్ ప్రెజెంటేషన్‌తో రూపొందే ఈ చిత్రం వరుణ్‌కు మంచి బూస్ట్ ఇస్తుందని సినీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ‘కొరియన్ కనకరాజు’ తర్వాత, ఈ లవ్ స్టోరీ(Love Story)తో వరుణ్ ఫామ్‌లోకి వస్తాడని అభిమానులు నమ్ముతున్నారు.







