రాష్ట్రంలో బార్ల (Bars) ద్వారా భారీ స్థాయిలో అవినీతి (Corruption), నకిలీ మద్యం (Fake Liquor) వ్యాపారం (Business) జరుగుతోందని, నెలకు రూ.5 కోట్లు దండుకుని బార్లలో స్కాం చేస్తున్నారని వైసీపీ(YSRCP) సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ డిపోల నుండి కాకుండా బయట సరుకు తెచ్చి విక్రయిస్తున్నారు. ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో చంద్రబాబు చెప్పాలి” అని నాని ప్రశ్నించారు. బార్లలో తనిఖీలు చేయగల ధైర్యం చంద్రబాబుకుందా అని సవాల్ విసిరారు.
నకిలీ మద్యం విషయంలో టీడీపీ(TDP), పచ్చ మీడియా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని పేర్ని నాని మండిపడ్డారు. “జగన్ ప్రభుత్వం మొదటి నుంచే క్యూ ఆర్ కోడ్ వ్యవస్థను అమలు చేసింది. ఇప్పుడు చంద్రబాబు దాన్ని కొత్తగా కనుక్కున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. 16 నెలలుగా నకిలీ మద్యం ఏరులై పారుతుంటే సీఎం ఎందుకు మౌనం వహిస్తున్నారు? రూ.99 మద్యం అమ్మకం ఆపి నకిలీ సరుకును ప్రోత్సహిస్తున్నారు. రోజుకు లక్షల రూపాయల బిజినెస్ జరుగుతోంది, ఆ డబ్బు కరకట్ట బంగ్లాలోకి వెళ్తోందా? లేక హైదరాబాద్ విమానాల్లో వెళ్తుందా?” అని ఘాటుగా ప్రశ్నించారు.
బార్ పాలసీనే రాష్ట్రంలో అతి పెద్ద స్కాంగా అభివర్ణించిన పేర్ని నాని, “విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు వంటి నగరాల్లో బార్లు నెలకు రూ.80 లక్షల విలువైన సరుకు ప్రభుత్వానికి కొనాలి. ఆ లెక్కలు చూపగలరా? బార్లలో విక్రయించే మద్యం నాన్ పెయిడ్, నకిలీ మద్యం కావడం నిర్ధారణ అయింది. ఈ స్కాం వెనుక ఎవరి హస్తం ఉందో త్వరలో బయటపడుతుంది” అని హెచ్చరించారు. ఎల్లోమీడియా, టీడీపీ నాయకులు నకిలీ మద్యం పట్ల మౌనం వహించడం దుర్మార్గమని ఆయన విమర్శించారు.








