ఏపీకి భారీ వర్ష సూచన.. పిడుగులతో కూడిన వర్షాలు

భారీ వర్షాలకు రెడ్ అలర్ట్: ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

రానున్న మూడు గంటల్లో ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ (Red Alert), మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ (Orange Alert)ను ప్రకటించింది.

రెడ్ అలర్ట్ జిల్లాలు..
ఆరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA హెచ్చరించింది. డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు
ఏడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ సమయంలో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని APSDMA కోరింది.

Join WhatsApp

Join Now

Leave a Comment