సినిమా వాళ్లను మాజీ సీఎం (Former CM) వైఎస్ జగన్ (YS Jagan) అవమానించారని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ (Assembly)లో కొంతమంది మాట్లాడిన మాటలను సినీ నిర్మాత, పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి (R. Narayana Murthy) తీవ్రంగా ఖండించారు. ఆరోజు తాను కూడా జగన్‌ను కలిసిన వారిలో ఉన్నానని, తనను కలిసేందుకు వెళ్లిన సినిమా వాళ్లకు ఆయన ఎంతో గౌరవం ఇచ్చారని చెప్పారు. అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), కామినేని శ్రీనివాస్ (Kamineni Srinivas) చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ.. ఆరోజున జరిగిన సంఘటనను ఆర్.నారాయణమూర్తి వివరించారు.
ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ, కామినేని చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) చేసిన వ్యాఖ్యలు 100 శాతం నిజమన్నారు. తాను కూడా నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన వారిలో ఉన్నానని, జగన్ గవర్నమెంట్ ఎవరినీ అవమానించలేదు. చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ఎంతో గౌరవం ఇచ్చారు అని తెలిపారు.
“జగన్ ముఖ్యమంత్రిగా, పేర్ని నాని సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు నన్ను కూడా ఆహ్వానించారు. కోవిడ్ సమయంలో పరిశ్రమ పరిస్థితి ఏమవుతుందోనని భయపడి ఉన్నప్పుడు చిరంజీవి నేతృత్వంలో సీఎం జగన్‌ను కలిశాం. పరిశ్రమ ప్రతినిధులు సీఎంను కలవాలని నిర్ణయం తీసుకుంటే, ఆ సమావేశంలో చిరంజీవి ముందడుగు తీసుకుని నేరుగా మంత్రితో మాట్లాడారు. ఆ సమయంలో తీసుకున్న రోల్‌కు నేను హృదయపూర్వకంగా సెల్యూట్ చెబుతున్నాను” అని ఆర్.నారాయణ మూర్తి తెలిపారు.
‘చిరంజీవిని అవమానించారు’ అని జరుగుతున్న ప్రచారం తప్పు అన్నారు. చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి పరిశ్రమ ప్రతినిధులను సమీకరించి, నాటి సీఎం వైఎస్ జగన్ వద్దకు తీసుకెళ్లి కోవిడ్ సమయంలో ఇండస్ట్రీ సమస్య పరిష్కరించడానికి ప్రయత్నించారని గుర్తుచేశారు. వైఎస్ జగన్ సైతం సినిమా వాళ్లకు ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని తమకు భరోసా ఇచ్చారని చెప్పారు. ఇంకా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నాను” అని ఆర్.నారాయణమూర్తి కోరారు.
బ్రేకింగ్
— Telugu Feed (@Telugufeedsite) September 27, 2025
బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన ఆర్.నారాయణమూర్తి
వైఎస్ జగన్ ప్రభుత్వం ఎవరినీ అవమానించలేదు.. సానుకూలంగా స్పందించారు..
సినిమా వాళ్లకు @ysjagan ఎంతో గౌరవం ఇచ్చారు.. ఇండస్ట్రీకి ఏం కావాలో అది చేస్తామన్నారు
అసెంబ్లీలో కొంతమంది చేసిన కామెంట్స్‌పై చిరంజీవి స్పందించిన… pic.twitter.com/vsF1a3mgjP








