జనసేన ఎమ్మెల్యే ఇంటి­పన్ను రూ.24 లక్షలు.. కట్టమని అడిగితే..

జనసేన ఎమ్మెల్యే ఇంటి­పన్ను రూ.24 లక్షలు.. కట్టమని అడిగితే..

జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఇంటి పన్ను చెల్లింపుపై పెద్ద వివాదం రేగింది. ముంజేరు గ్రామ సర్పంచ్ పూడి నూకరాజు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే లోకం మాధవి ఇంటిపై రూ.24 లక్షల పన్ను బకాయి ఉందని చెప్పారు. ఈ మొత్తాన్ని తక్షణమే చెల్లిస్తే, పంచాయతీ అభివృద్ధి పనులకు మార్గం సుగమమవుతుందని మండల సర్వసభ్య సమావేశంలో స్పష్టం చేశారు.

భోగాపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఉప్పాడ అనూషారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సర్పంచ్ చేసిన వ్యాఖ్యలు ఎమ్మెల్యే మాధవికి ఆగ్రహాన్ని కలిగించాయి. సర్పంచ్‌పై అసహనం వ్యక్తం చేసిన ఆమె, “మీరు ఉన్నంత వరకు అభివృద్ధి జరగదు” అంటూ మండిపడ్డారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలంటూ మధ్యలోనే సమావేశం నుంచి నిష్క్రమించారు.

ఈ పరిణామం స్థానిక ప్రజల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రజలు ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అభివృద్ధి పనులకు సహకరించాలంటే ముందుగా ఇంటి పన్ను బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే ఇంటి పన్ను చెల్లింపుపై ప్రజల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment