రేపటి నుంచి దేశవ్యాప్తంగా (Nationwide) జీఎస్టీ పొదుపు ఉత్సవం (GST Savings Festival) ప్రారంభం కానున్నట్టు ప్రధాని (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi) ప్రకటించారు. జీఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నాయని, వాటితో కొత్త మధ్యతరగతి (Middle Class) వర్గం పుంజుకుంటోందని ఆయన అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ (Ease Of Doing) బిజినెస్(Business) మరింతగా పెరుగుతోందని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సంస్కరణలను అమలు చేస్తున్నామని ప్రధాని స్పష్టం చేశారు.
ఆదాయ పన్ను మరియు జీఎస్టీ రేట్ల తగ్గింపుతో ఇప్పటివరకు దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము పొదుపు అయినట్లు మోదీ తెలిపారు. ప్రజలు స్వదేశీ ఉత్పత్తులను (Indigenous Products) ప్రాధాన్యం (Priority)గా కొనుగోలు చేసి దేశీయ ఆర్థిక వ్యవస్థ (Economic System)ను బలపరచాలని ఆయన పిలుపునిచ్చారు.







