ఏపీ అసెంబ్లీలో బోండా ఉమా Vs పవన్ కళ్యాణ్

ఏపీ అసెంబ్లీలో బోండా ఉమా Vs పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ సమావేశాల (Assembly Meetings) రెండో రోజున ప్లాస్టిక్‌ నియంత్రణ (Plastic Control) అంశంపై చర్చ సాగింది. ఈ సందర్భంగా అధికార కూటమిలోని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఎమ్మెల్యే బోండా ఉమా (Bonda Uma), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)పై పరోక్ష విమర్శలు చేశారు. దీంతో సభలో జరిగిన వాదోపవాదం బోండా ఉమా వర్సెస్ పవన్ కళ్యాణ్గా మారి ఆసక్తికర సన్నివేశానికి దారితీసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

బోండా ఉమా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
బోండా ఉమా మాట్లాడుతూ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (Pollution Control Board) పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఎక్కడా సరిగా పనిచేస్తున్నట్టు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఏదైనా పనిమీద వెళ్లితే డిప్యూటీ సీఎం పేరు చెబుతున్నారు. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలని డైరెక్ట్ గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య (Krishnayya) చెబుతున్నారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

విశాఖలో రాంకీ పరిశ్రమ చాలా పొల్యూషన్ ను డైరెక్ట్ గా సముద్రంలోకి ఇండస్ట్రీ వ్యర్ధాలను వదిలిపెడుతుంద‌ని, సీఎం చంద్రబాబు అలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చినా ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు. అయోధ్య రామిరెడ్డి వైఎంపీ ఛైర్మన్ కృష్ణయ్యను ఏం మ్యానేజ్ చేస్తున్నారో తెలియడం లేదంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కొంచెం పనిచేసే విధంగా ఆయన గట్టిగా మందలించాలంటూ డిప్యూటీ సీఎంని కోరుతున్నామ‌ని సెటైర్లు వేశారు. చైర్మన్ దగ్గరకి తీసుకెళ్లితే 40 సంవత్సరాల్లో ఇలాంటి ఎమ్మెల్యేలు చాలా మంది చూశాన‌ని దురుసుగా మాట్లాడుతున్నార‌ని, అది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యేలు గెలిస్తేనే చైర్మన్ కూర్చున్నాడ‌ని పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డ్ చైర్మ‌న్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

పవన్ కళ్యాణ్ సీరియ‌స్ రియాక్ష‌న్‌..
బోండా ఉమా వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంట‌నే స్పందించారు. “బోండా ఉమా మాటలు సరిద్దుకోవాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అందుబాటులో లేదనడం తప్పుడు అభిప్రాయం” అని ఆయన స్పష్టం చేశారు. రాంకీ కంపెనీపై ఇప్పటికే చర్యలు తీసుకుని షోకాజ్ నోటీసులు జారీ చేశామని గుర్తుచేశారు.

పరిశ్రమలు వ్యర్థాలను వదులుతున్నాయి కాబట్టి వెంటనే బ్యాన్ చేస్తే అనేక కంపెనీలు మూతపడే పరిస్థితి వస్తుంది. దాంతో అనేక కుటుంబాలు రోడ్డున పడిపోతాయి అన్నారు. చిన్న ఫ్లెక్సీలను బ్యాన్ చేయడానికే ఎంత ఆలోచిస్తున్నామో, పరిశ్రమలపై మరింత కఠిన చర్యలకు ముందు ఆర్థిక, సామాజిక ప్రభావాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక రాంకీ కంపెనీపై చర్యలు రాజకీయ ఉద్దేశంతో కాకుండా న్యాయపరంగా మాత్రమే ఉండాలని పవన్ స్పష్టం చేశారు. “వారు వేరే పార్టీల్లో పనిచేశారని టార్గెట్ చేస్తే అది సరికాదు” అని వ్యాఖ్యానించారు. ప్లాస్టిక్‌ నియంత్రణ చర్చలో బోండా ఉమా – పవన్ కళ్యాణ్ మధ్య చోటుచేసుకున్న ఈ వాదోపవాదం అసెంబ్లీలో ప్రధాన ఆకర్షణగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment