‘కాంతార’ చిత్రానికి సొంత రాష్ట్రంలోనే సమస్య: కోర్టును ఆశ్రయించిన నిర్మాతలు

'కాంతార' చిత్రానికి సొంత రాష్ట్రంలోనే సమస్య: కోర్టును ఆశ్రయించిన నిర్మాతలు

మలయాళ స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) నటించిన ‘కాంతార’ (Kantara) కొత్త సినిమా మరో రెండు వారాల్లో థియేటర్లలోకి రానుంది. అయితే ఇంతవరకు ప్రమోషన్స్ మొదలుపెట్టకపోవడం ఆశ్చర్యం కలిగించింది. సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తయినప్పటికీ, సొంత రాష్ట్రం కర్ణాటకలోనే ఒక సమస్య ఉన్నట్టు సమాచారం. ఈ విషయం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

విషయం ఏమిటంటే..

ఇటీవల కర్ణాటక ప్రభుత్వం (Karnataka Government)  సినిమా (Cinema)  టికెట్ ధరల (Ticket Prices)పై సంచలన నిర్ణయం తీసుకుంది. మల్టీప్లెక్స్‌లలో టికెట్ గరిష్ట ధరను రూ.236కు తగ్గించింది. ఈ నిబంధన ఇప్పటికే అమలులో ఉంది. చిన్న బడ్జెట్ సినిమాలకు ఇది పెద్ద సమస్య కానప్పటికీ, ‘కాంతార’ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలకు పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలంటే టికెట్ ధరలు పెంచడం తప్పనిసరి. అందుకే నిర్మాతలు హొంబలే ఫిల్మ్స్ (Hombale Films) ఇప్పుడు కోర్టులో రిట్ పిటిషన్ (Writ Petition)  దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

రిట్ పిటిషన్ వల్ల ప్రయోజనాలు..

పెంచిన టికెట్ ధరలకు అనుమతి ఇవ్వాలని ‘కాంతార’ నిర్మాతలు ఈ పిటిషన్ ద్వారా కోరారు. ఒకవేళ ఈ పిటిషన్ అనుకూలంగా ఉంటే, భవిష్యత్తులో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించేవారికి మార్గం సుగమం అవుతుంది. లేకపోతే ‘కేజీఎఫ్’ లాంటి భారీ రికార్డులను అధిగమించడం కష్టమవుతుంది. అంతేకాకుండా, కర్ణాటకలో తక్కువ ధరలు, ఇతర తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ధరలు పెడితే విమర్శలు రావచ్చు. మరి ఈ పిటిషన్ ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

దసరా సందర్భంగా అక్టోబర్ 2న ‘కాంతార: చాప్టర్ 1’ థియేటర్లలోకి రానుంది. మొదటి పార్ట్ కేవలం రూ.15-20 కోట్లతో నిర్మిస్తే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో రెండో భాగానికి కళ్ళు చెదిరే బడ్జెట్ పెట్టారు. ఈ భాగంలో రుక్మిణి వసంత్ లాంటి నటీనటులు కూడా భాగమయ్యారు. మరి ఈసారి ‘కాంతార’ ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment