“ఇంకా పవన్ భార్యగానే చూస్తారా?”.. రేణూ దేశాయ్ ధీటైన జవాబు

"ఇంకా పవన్ భార్యగానే చూస్తారా?".. రేణూ దేశాయ్ ధీటైన జవాబు

తెలుగు సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య (Former Wife) రేణూ దేశాయ్ (Renu Desai) తన ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లో పవన్ అభిమానికి ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఒక పవన్ ఫ్యాన్ ఆమెను ఉద్దేశించి “మేము మిమ్మల్ని ఇంకా పవన్ కళ్యాణ్ భార్యగానే చూస్తాం. మీ జీవితంలో వేరొక మగాడిని ఊహించలేం” అని కామెంట్ చేయగా, రేణూ దేశాయ్ దీనిపై తీవ్రంగా స్పందించారు.

రేణూ దేశాయ్ స్పందన
రేణూ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆ అభిమాని వ్యాఖ్యను ఉదహరిస్తూ, సమాజంలో ఇప్పటికీ మహిళలను భర్త లేదా తండ్రి ఆస్తిగా చూసే పితృస్వామిక ధోరణి ఉందని విమర్శించారు. ఆమె మాట్లాడుతూ, “మహిళలు చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి ‘అనుమతి’ అడగడం, వంటగదికే పరిమితం కావాలనే ఆలోచనలు ఇప్పటికీ ఉన్నాయి. ఈ ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా నేను గళం విప్పుతాను. నా ఫాలోవర్స్ ఏమనుకుంటారో అని నేను భయపడను. రాబోయే మహిళా తరాల కోసం ఈ మార్పు తీసుకురావాలనేది నా ప్రయత్నం.” అని అన్నారు.

ఫెమినిజం అంటే కేవలం నైట్‌ పార్టీలకు వెళ్లడం కాదని, మహిళలను పశువులుగా లేదా వస్తువులుగా చూసే ఆలోచనలను ప్రశ్నించడమే నిజమైన ఫెమినిజం అని ఆమె పేర్కొన్నారు. గర్భహత్యలు, మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు స్వస్తి చెప్పాలని, తర్వాతి తరాల మహిళలకు ఈ సమాజంలో ఒక గౌరవమైన స్థానం దక్కాలని ఆమె ఆకాంక్షించారు. రేణూ దేశాయ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment