నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కార్కి?

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కార్కి?

నేపాల్‌ (Nepal)లో అవినీతి (Corruption)కి వ్యతిరేకంగా జరిగిన యువత ఆందోళనల తర్వాత ప్రధాని (Prime Minister) కేపీ శర్మ ఓలి (K.P. Sharma Oli) రాజీనామా (Resignation) చేశారు. ఆయన మంత్రివర్గంలోని చాలామంది సభ్యులు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ పరిస్థితుల్లో, మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కి (Sushila Karki) నేపాల్ తాత్కాలిక (Interim) ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని సమాచారం. జెన్-జెడ్ (Gen-Z) యువ ప్రతినిధులు ఈమె పేరును తాత్కాలిక ప్రధానిగా ప్రతిపాదించారు. ఆర్మీ, అధ్యక్షుడితో జరిగిన చర్చల అనంతరం అత్యున్నత పదవికి ఆమెను ఎంపిక చేశారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు ఆమె పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

జెన్-జెడ్ నిరసనకారులు, అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్డెల్ మధ్య జరిగిన ఏకాభిప్రాయం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక ప్రభుత్వానికి చిన్న మంత్రివర్గం ఉంటుందని, మొదటి సమావేశం శుక్రవారం రాత్రే జరగవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మంత్రివర్గం ఫెడరల్ పార్లమెంట్‌తో పాటు ఏడు ప్రాంతీయ పార్లమెంట్‌లను రద్దు చేయాలని సిఫార్సు చేసే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment