కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం ఉద్రిక్తతలకు దారితీసింది. రైతులకు యూరియా అందుబాటులో లేకపోవడంపై జడ్పీటీసీలు అధికారులను నిలదీశారు. దీంతో అధికారులు, జెడ్పీటీసీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
యూరియా వివాదం
సమావేశంలో యూరియా కొరతపై స్పష్టత కోరిన జెడ్పీటీసీలకు, “జిల్లాలో యూరియా కొరత ఏమీ లేదు” అని ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ అధికారిణి సమాధానం ఇచ్చారు. దీనిపై ఆగ్రహించిన జెడ్పీటీసీలు, ఆమె అబద్ధాలు చెబుతున్నారని ఆరోపిస్తూ వేదికను ముట్టడించారు. “యూరియా కొరత లేదన్న వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.
పోలీసుల జోక్యం
సమావేశంలో జెడ్పీటీసీల ఆందోళన కారణంగా పోలీసు బలగాలు సభా మందిరంలోకి ప్రవేశించాయి. దీనిపై జెడ్పీటీసీ సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. “ప్రజాప్రతినిధుల సమావేశంలో ఇంతమంది పోలీసులను ఎందుకు మోహరించారు?” అంటూ కలెక్టర్‌ను నిలదీశారు. ఈ సంఘటనతో కొంతసేపు సమావేశం రసాభాసకు దారితీసింది. చివరికి పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత సమావేశం కొనసాగింది.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Feed (@Telugufeedsite) September 11, 2025
రసాభాసగా కృష్ణాజిల్లా జెడ్పీ సర్వసభ్య సమావేశం
యూరియా కొరతపై స్పష్టత అడుగుతూ అధికారులను నిలదీసిన జెడ్పీటీసీలు
యూరియా కొరత లేదంటూ సమాధానమిచ్చిన ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ అధికారిణి
అబద్ధాలు చెబుతున్నారంటూ సమావేశం వేదికను ముట్టడించిన జెడ్పీటీసీలు
యూరియా కొరత… pic.twitter.com/g4UvCcUif4