అనంతపురం భారీ బహిరంగ సభకు కూటమి ప్రభుత్వం ప్లాన్ చేసింది. అందుకు అనుగుణంగా భారీ జనసమీకరణ చేపడుతోంది. రేపు అనంతపురం వేదికగా జరగనున్న సభకు వస్తేనే సూపర్ సిక్స్ పథకాలు వర్తిస్తాయని, సభకు రానివారికి పథకాలు కట్ అవుతాయని గ్రామాల్లో దండోర వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభ సందర్భంగా టీడీపీ నేతల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభకు హాజరైతేనే సంక్షేమ పథకాలు వర్తిస్తాయని చాటింపు వేయించి మరీ టీడీపీ నేతలు జనాన్ని భయపెడుతూ జనసమీకరణ చేపడుతున్నారని ఆరోపణ వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం అచ్చంపల్లిలో జరిగిన ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డబ్బు చాటింపులో “తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు కావాలంటే సీఎం సభకు రావాలి.. లేదంటే రావు” అని పేర్కొనడం, అలాగే “వచ్చే దీపావళి నుంచి ఆడబిడ్డ నిధి ఇస్తారు, కానీ సభలో పాల్గొన్నవారికే వర్తిస్తుంది” అంటూ చెప్పిన వీడియో వైరల్‌గా మారింది. ఇక రేపు అనంతపురంలో జరిగే సూపర్ సిక్స్ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు సభకు ముందు వెలుగులోకి రావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
అనంతపురంలో సీఎం పర్యటన.. టీడీపీ నేతల అత్యుత్సాహం
— Telugu Feed (@Telugufeedsite) September 9, 2025
సీఎం చంద్రబాబు సభకు వస్తేనే సంక్షేమ పథకాలు వర్తిస్తాయంటూ చాటింపు
కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం అచ్చంపల్లిలో ఘటన
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు కావాలంటే సీఎం చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొనాలని హుకుం
సోషల్… pic.twitter.com/VqaY0sC8lK