ఒక ‘హనుమ’ కథ.. బాబు విష ప్రచార పథకంలో కీలుబొమ్మ?

ఒక ‘హనుమ’ కథ.. బాబు విష ప్రచార పథకంలో కీలుబొమ్మ

కర్మ (Karma) ఎవ్వరినీ విడిచిపెట్టదంటారు. మనం చేసే పనులకు ఎప్పటికైనా, ఎన్నటికైనా మనమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. గతకొన్ని రోజులుగా సుగాలి ప్రీతి (Sugali Preethi) అంశాన్ని చూసినా, క్రికెటర్ హనుమ విహారి వ్యవహారాన్ని చూసినా టీడీపీ – జనసేన (TDP-JanaSena) పార్టీలను కర్మ వెంటాడుతూనే ఉందనిపిస్తోంది.

సుగాలి ప్రీతి ఘటన 2017 ఆగస్టులో చంద్రబాబు (Chandrababu) ముఖ్యమంత్రి కుర్చీలో ఉండగా జరిగినా, లేని కట్టుకథలను సృష్టించి వైసీపీ(YSRCP)పై విష ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధిపొందాలని గత ఎన్నికల్లో తీవ్రంగా ప్రయత్నించారని ప్ర‌జ‌లంద‌రికీ తెలిసిందే. ఆరోజు చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో టీడీపీ – జనసేన పార్టీలు ఇప్పుడు ప్రజల ముందు దోషిగా నిలబడ్డాయని చెప్ప‌క‌త‌ప్ప‌డం లేదు.

ఇప్పుడు హనుమ విహారి ఉదంతం కూడా అంతే. గతంలో ఏసీఏ(ACA) తన నియమ నిబంధనలను అనుసరించి విహారి విషయంలో ముందుకు వెళ్తే, దాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ – జనసేన పార్టీలు వైసీపీపై తప్పుడు ప్రచారం చేశాయి. చివరకు అవే ఆరోపణల ఊబిలో ఈ రెండు పార్టీలు ఇప్పుడు మునిగిపోయాయి. అందుకే కర్మ ఎవ్వరినీ విడిచిపెట్టదు.

గతంలో ఏమి జరిగింది..
2024 ఫిబ్రవరిలో ఏసీఏపై ధ్వజమెత్తుతూ హనుమ విహారి (Hanuma Vihari) సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్స్ చేశాడు. బెంగాల్ తో జరిగిన మ్యాచ్ లో ఒక ఆటగాడిపై నోరుపారేసుకోవడమే కాక, వేధింపులకు గురిచేశారన్న ఆరోపణలపై అప్పటి ఏసీఏ దర్యాప్తు చేసింది. జట్టులో వర్గవిభేదాలను ప్రోత్సహించడం తదితర కారణాలతో మరొక వ్యక్తిని కెప్టెన్ గా నియమించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏసీఏ మీడియాకు అప్పట్లో సవివరంగా ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది.

1.హనుమ విహారం ఓల్డ్ పోస్ట్, 2. హనుమ విహారి మీద కంప్లయింట్స్, 3.గత ఏసీఏ ప్రకటన, వరుసగా

రాష్ట్రంలో ఎలాగైనా అధికారాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న లక్ష్యంలో భాగంగా టీడీపీ – జనసేన పార్టీలు అప్పట్లో తీవ్రస్థాయిలో బురదజల్లుడు రాజకీయాలు చేశాయి. వారి అజెండాను భుజాలకు ఎత్తుకున్న ఎల్లో మీడియా హనుమ విహారి మొదటి ఉదంతంలో వాస్తవాలను దాచేసి దానికి పూర్తిగా రాజకీయ రంగు పులిమాయి.

Photo : ఈనాడు, ఆంధ్రజ్యోతి క్లిప్పింగ్స్ – పవన్, లోకేష్‌తో విహారి ఫొటో

మొదటి ఉదంతం జరిగి ఏడాదిన్నర గడవకముందే క్రికెట‌ర్ హ‌నుమ విహారి కూట‌మి ప్ర‌భుత్వ నేతృత్వంలో ప‌నిచేస్తున్న‌ ఏసీఏపై మరోబాంబు పేల్చాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ తనకు తగిన గౌరవం ఇవ్వలేదని, ఏసీఏలో రాజకీయ జోక్యం ఉందని, అందుకనే అవకాశాలు రావడం లేదని జాతీయ మీడియాకు హనుమ విహారి చెప్పాడు. ఈ ఉదంతంపై ట్వీట్ కూడా చేశాడు. తాను మూడు ఫార్మాట్ల‌లో ఆడేందుకు ఆంధ్ర‌ను విడిచి త్రిపుర‌కు వెళ్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు.

Photo : ఈనెల 26న‌ ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ విడిచిపెడుతున్న‌ట్లుగా ప్ర‌క‌టించిన విహారి

విహారి ఉదంతం ఆధారంగా ప్రస్తుతం ఏసీఏలో టీడీపీ క్షుద్ర రాజకీయాలు తారాస్థాయికి చేరాయనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు క్రీడాభిమానులు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన వెంటనే లోకేష్ గ్యాంగులోని వ్యక్తులు టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్) ఏసీఏ అధ్యక్షుడు అయ్యారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కార్యదర్శి అయ్యారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ను అత్యుత్తమ క్రికెట్ కు వేదికగా మార్చడానికి బదులు, రాజకీయాలకు అడ్డాగా మార్చారన్న చ‌ర్చ విహారి ట్వీట్‌తో విస్తృత‌మైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష రాజకీయాలు చేస్తున్నట్టుగానే క్రికెట్ స్టేడియంపై కూడా కూటమి ఆగడాలు ఆపలేదు. విశాఖ‌లో ఏసీఏకు ప్ర‌ధాన‌ స్టేడియంగా ఉన్న మైదానం పేరును వైయస్ఆర్‌ను తొలగించి ఉత్త‌ ఏసీఏ-వీడీసీఏగా మార్చిన విష‌యం తెలిసిందే.

లోకేష్ గ్యాంగ్ అరాచకాలు
ఏసీఏలో లోకేష్ గ్యాంగ్ అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని, ఏసీఏ పరిపాలన పూర్తి పారదర్శకత లోపించిందని, నిర్ణయాలకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఏసీఏ సమావేశంలో సభ్యులకు అందించడం లేదని స‌మాచారం. ఆమోదం లేకుండానే ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. అలాగే అంతర్జాతీయ మ్యాచ్ లు, ఐపీఎల్ మ్యాచ్ ల టిక్కెట్లు భారీగా బ్లాక్ కు తరలిపోతున్నాయి. లోకేష్ గ్యాంగ్ అరాచకాలతో మొత్తం ఏసీఏ భ్రష్టుపట్టిపోయిందని క్రీడాకారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ నుంచి అతిపెద్ద స్టేడియం మార్పు..?
అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర‌మోడీ స్టేడియం త‌ర‌హాలో విశాఖ‌ప‌ట్ట‌ణంలోనూ అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌కు ఆతిథ్య‌మిచ్చే స్థాయి మైదానం నిర్మించాల‌న్న ఆలోచ‌న వాస్త‌వానికి గ‌త వైయస్ఆర్‌ సీపీ హ‌యాంలో బీజం ప‌డింది. దానికి కావాల్సిన ప్ర‌క్రియ‌ల‌ను నాటి వైయ‌స్ జ‌గ‌న్ స‌ర్కార్ కంప్లీట్ చేసింది. వైజాగ్‌లో అతిపెద్ద ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంతో పాటు ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. స్టేడియం నిర్మాణానికి సంబంధించి భూమిని కూడా నాటి స‌మీక‌రించింది. ప్ర‌స్తుతం విశాఖ‌లో ఉన్న వైయ‌స్ఆర్‌ స్టేడియం దేశ‌వాళీ మ్యాచ్‌ల‌కు, కొత్త‌గా నిర్మించే స్టేడియంలో అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌ను ఆడించాల‌ని ప్ర‌ణాళిక రూపొందించింది. అయితే ప్ర‌భుత్వం మారిన త‌రువాత అంత‌ర్జాతీయ స్టేడియాన్ని అమ‌రావ‌తికి త‌ర‌లిస్తున్నారు.

బెజ‌వాడ గ్యాంగ్ ఎంట్రీతో ఆందోళ‌న‌..
కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ స్టేడియం స్థితిగ‌తులు ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డ్డాయ‌నే మాట క్రీడాకారుల నుంచి బ‌హిరంగంగానే వినిపిస్తోంది. ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్‌లోకి బెజ‌వాడ గ్యాంగ్ ఎంట్రీతో విశాఖ‌లో అన్ని హంగుల‌తో నిర్మించాల్సిన స్టేడియం అమ‌రావ‌తికి త‌ర‌లిపోతోంద‌న్న‌విష‌యం క్రీడాకారుల‌ను ఆందోళ‌నకు గురిచేస్తోంది. అంత‌ర్జాతీయ స్టేడియం విశాఖలో కాదు, అమ‌రావ‌తిలో నిర్మిస్తామ‌ని ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ చైర్మ‌న్ కేశినేని చిన్ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. విశాఖ‌లో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో నిర్మించాల్సిన క్రికెట్ స్టేడియం అమ‌రావ‌తికి త‌ర‌లిస్తున్నార‌ని క్రీడాకారులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. క్రీడ‌ల్లోనూ రాజ‌కీయ జోక్యం త‌గ‌ద‌ని క్రీడాభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment