విశాఖ (Visakha) పట్టణంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. రోడ్డు (Road)పై ప్రయాణిస్తున్న బస్సు(Bus)లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలో బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది. ఒక్కసారిగా బస్సులోంచి మంటలు చెలరేగడంతో ప్రయాణికులు (Passengers) పరుగులు తీశారు. ప్రయాణికులు బస్సు దిగి చూస్తుండగానే నడి రోడ్డుపై ఏపీఎస్ ఆర్టీసీ(APSRTC) పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతిపురం జంక్షన్ (Shantipuram Junction) వద్ద చోటు చేసుకుంది. విశాఖలో నడిరోడ్డుపై బస్సు దగ్ధమైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వివరాల్లోకి వెళితే.. ఏపీఎస్ ఆర్టీసీ బస్సు కుర్మన్నపాలెం నుంచి విజయనగరం బయల్దేరింది. సాధారణంగా బస్సులో 60 మంద ప్రయాణించాల్సి ఉండగా, 130 మంది ప్రయాణికులతో వెళ్తుంది. స్త్రీ శక్తి పథకం వల్ల 130 మంది లో మహిళలే 99 మంది ఉన్నారు. దీంతో ఓవర్ లోడ్(Overload) అయిన బస్సులో 130 మందిని లాగలేక మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. బస్సు కండక్టర్ కూడా బస్సులో 130 మంది ఉన్నారని స్పష్టం చేశారు. ఓవర్ లోడ్ కారణంగా బస్సు లో మంటలు చెలరేగాయని, బస్సు కెపాసిటీ 65 కాగా 130 మంది ప్రయాణించడంతో ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమిక అంచనా వేస్తున్నారు.








