కూకట్పల్లి (Kukatpally)లో సంచలనం సృష్టించిన సహస్ర (Sahasra) హత్య కేసును (Murder Case) పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కేవలం ఒక క్రికెట్ బ్యాట్ (Cricket Bat) దొంగతనం కోసమే నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు సైబరాబాద్ (Cyberabad) సీపీ(CP) అవినాష్ మహంతి (Avinash Mahanti) తెలిపారు. సహస్ర ఇంటి పక్కనే నిందితుడి ఇల్లు ఉండగా, సహస్ర తమ్ముడి క్రికెట్ బ్యాట్ నచ్చడంతో దాన్ని దొంగిలించాలని నెల రోజుల క్రితమే ప్రణాళిక వేసుకున్నాడు. ఈనెల 18న తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో నిందితుడు ఇంటికి వచ్చి బ్యాట్ తీసుకుంటుండగా, సహస్ర అతడిని చూసి అరిచింది. దీంతో కోపంతో ఆమెను బెడ్రూమ్లోకి తోసి, వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి చంపేశాడు అని సైబరాబాద్ సీపీ తెలిపారు.
నిందితుడు ఇంట్లో ఎవరికీ తెలియకుండా స్నానం చేసి, బట్టలు వాషింగ్ మెషీన్లో వేసేశాడు. క్రైమ్ సినిమాలు చూడటం, ఆర్థిక ఇబ్బందులు వంటి కారణాలతోనే ఈ దొంగతనానికి ప్రయత్నించినట్లు విచారణలో తేలింది. ఈ హత్య స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.