అటవీ శాఖ (Forest Department) సిబ్బందిపై శ్రీశైలం (Srisailam) తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఎమ్మెల్యే దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు (CM Chandrababu) కూడా సీరియస్ అయిన ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి (Budda Rajasekhar Reddy) అటవీశాఖ సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో ఆశ్చర్యకరమైన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. నల్లమల ఫారెస్ట్ (Nallamala forest) శిఖరం చెక్‌పోస్ట్ వద్ద జరిగిన ఘటనలో, పోలీసులు శ్రీశైలం జనసేన (Janasena) ఇంచార్జి అశోక్ రౌత్ (Ashok Routh)ను A1 నిందితుడిగా, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డిని A2 నిందితుడిగా చేర్చడం సంచలనంగా మారింది. సీసీ కెమెరాలో స్పష్టంగా ఎమ్మెల్యే బుడ్డా దాడి చేస్తున్న దృశ్యాలు ఉన్నప్పటికీ, ఆయనను A2గా పెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
అటవీశాఖ సిబ్బంది, అసోసియేషన్ నాయకులు నిన్న అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేన అధినేతకే అటవీశాఖ మంత్రిత్వశాఖ ఉండగా, ఆయన పార్టీ ఇంచార్జి పేరును ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చూపించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. అటవీశాఖకు, జనసేనకు ఈ కేసు ముడిపెట్టిన పోలీసుల తీరు పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై జనసేన నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ”ఇదేమీ బానిసత్వం రా దేవుడా.. ఇన్నాళ్లూ జెండాలే అనుకుంటే.. ఇప్పుడు వాళ్ల కేసులు కూడా మోయాలా..?” అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇక, అశోక్ రౌత్, బుడ్డా రాజశేఖరరెడ్డి పై 115(2), 127(2), 351(2), 132 r/w, 3(5) BNS యాక్ట్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే వీటన్నీ బెయిలబుల్ కేసులే కావడంతో చట్టపరమైన ఇబ్బందులు పెద్దగా లేవు. అయినప్పటికీ, కేసును ఇలా మలుపు తిప్పడం వెనుక ఉన్న ఉద్దేశంపై రాజకీయ వర్గాల్లో వేడెక్కిన చర్చ నడుస్తోంది.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Feed (@Telugufeedsite) August 22, 2025
శ్రీశైలం @JaiTDP ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కేసులో ట్విస్ట్
ఫారెస్ట్ సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి కేసులో శ్రీశైలం @JanaSenaParty ఇంచార్జి పైనా కేసు
శ్రీశైలం జనసేన ఇంఛార్జి అశోక్ రౌత్ ని A1 నిందితుడు గా చేర్చిన పోలీసులు
సీసీ ఫుటేజీలో దాడి చేస్తూ కనిపించిన… pic.twitter.com/kYFbLRrEkg