రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (Chief Minister) హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఏపీ (Andhra Pradesh) హైకోర్టు (High Court)లో పిటిషన్ దాఖలైంది. మంత్రిగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ పరిపాలనను గాలికొదిలేసి, రాష్ట్రానికి చుట్టం చూపుగా వస్తు, సినిమాలపైనే శ్రద్ధ వహిస్తూ, ఎక్కువ కాలం హైదరాబాద్ (Hyderabad)లోనే గడుపుతున్నారని ఏకంగా రాష్ట్ర అత్యున్నత ధర్మాసనంలో పిటిషన్ వేశారు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ (Vijay Kumar).
జనసేన(Janasena) అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై విజయ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు వాదనలు జరిగాయి. మంత్రి పదవిలో కొనసాగుతూ సినిమాల్లో నటించడం చట్టబద్ధమేనా? అనే ప్రశ్నపై కోర్టు విచారణ చేపట్టింది. అయితే ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ (PP) అప్పీరవుతారని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలుపగా, ఇది పూర్తిగా ఏసీబీ (Anti-Corruption Bureau) పరిధిలోకి వచ్చే విషయం కాబట్టి, ఏసీబీ స్టాండింగ్ కౌన్సిల్ స్పందించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు స్పష్టం చేశారు. మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి సినిమాల్లో నటించడం వల్ల ప్రజాస్వామ్య నిబంధనలు, రాజ్యాంగ విలువలు దెబ్బతింటాయని వాదించారు.
ఈ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హోమ్ డిపార్ట్‌మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (GAD), ఏసీబీ(ACB)కి నోటీసులు జారీ చేసింది. అలాగే, సీబీఐ పేరును కూడా రికార్డులో పొందుపరచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. కేసును వారం రోజులకు లేదా వచ్చే వారం లిస్టింగ్‌లో మరోసారి విచారణకు తీసుకురానున్నట్లు హైకోర్టు వెల్లడించింది.
ఏపీలో విస్తారంగా వర్షాలు.. హైదరాబాద్‌లో పవన్
పవన్ కళ్యాణ్ కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తూ నెలలో అతి కొద్దిరోజులు మాత్రమే ఏపీలో ఉంటున్నారని, తన శాఖలపై సమీక్షలు కూడా చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న సమయంలో పవన్ హైదరాబాద్‌లో సేద తీరుతున్నారని, వరద కారణంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లోని గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. పవన్ పట్టింపు లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆదివాసీలు. తప్పక హాజరవ్వాల్సిన కార్యక్రమాలకు మాత్రం స్పెషల్ ఫ్లైట్స్‌లో వస్తూ తిరిగి వెళ్తున్నారని, సినిమా షూటింగ్స్ వంటి పర్సనల్ కార్యక్రమాలకు ప్రజాధనంతో ప్రత్యేక విమానాల్లో విహరిస్తున్నారని నెట్టింట్లోనూ పవన్‌పై ట్రోలింగ్స్ ఎక్కువయ్యాయి.