రిమాండ్ ఖైదీ (Remand Prisoner) గా ఉన్న వ్యక్తి జైలు (Jail) నుంచి పారిపోయిన ఆసక్తికర సంఘటన కడప (Kadapa) జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కళ్లుగప్పి ప్రొద్దుటూరు (Proddatur)లోని సబ్‌జైలు (Sub-Jail) నుంచి రిమాండ్ ఖైదీ పరారైన ఘటన జైలు అధికారులను కలవరపాటుకు గురిచేసింది. చోరీ కేసులో అరెస్టైన అంతర్రాష్ట్ర దొంగ మహమ్మద్ రఫీ (Mohammad Rafi) ఈ ఉదయం జైలు గోడ దూకి తప్పించుకున్నాడు.
ఈనెల 13న రాజుపాలెం పోలీసులు రఫీని అరెస్టు చేశారు. దువ్వూరు మండలం జిల్లెలకు చెందిన రఫీని అరెస్టు అనంతరం ప్రొద్దుటూరు సబ్‌జైలుకు తరలించారు. అయితే రిమాండ్‌లో ఉన్న రఫీ ఈరోజు ఉదయం జైలు గోడను దూకి పరారయ్యాడు. ఈ ఘటనపై జైలు శాఖ డీఐజీ (DIG) రవికిరణ్(Ravi kiran) స్వయంగా విచారణ చేపట్టారు. సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డీఐజీ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.