మ్యాచ్ ఫిక్సింగ్‌కు యత్నం.. క్రికెటర్‌కు ఐదేళ్ల నిషేధం

మ్యాచ్ ఫిక్సింగ్‌కు యత్నం.. క్రికెటర్‌కు ఐదేళ్ల నిషేధం

క్రికెట్ ర‌ల్స్‌ (Cricket Rules)కు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించిన శ్రీలంక (Sri Lanka) మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ సాలియా సమన్ పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) భారీ శిక్ష విధించింది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) అవినీతి నిరోధక నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయనపై ఐదేళ్ల నిషేధం అమలు చేయాలని ఐసీసీ ప్రకటించింది.

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు
2021లో అబుదాబి (Abu Dhabi) టీ10 లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ యత్నం చేసినట్లు సమన్‌పై ఆరోపణలు రుజువయ్యాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ అవినీతి నిరోధక ట్రిబ్యునల్ దర్యాప్తు జరిపి ఆయనను దోషిగా తేల్చింది. ఇప్పటికే సమన్ తాత్కాలిక నిషేధంలో ఉన్నందున, ఇకపై ఆయనకి మరో మూడున్నర సంవత్సరాలపాటు క్రికెట్ ఆడే అవకాశం లేకుండా పోయింది. ఐసీసీ స్పష్టంగా తెలిపిన ప్రకారం, సమన్ తనపై విధించిన శిక్ష కాలంలో ఏ రూపంలోనైనా క్రికెట్ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.

ఈ ఘటనతో మరోసారి క్రికెట్‌లో అవినీతి, ఫిక్సింగ్ ప్రబలుతున్నాయి అనే చర్చ మొదలైంది. ఐసీసీ మాత్రం కఠిన చర్యల ద్వారా ఇలాంటి సంఘటనలను అరికట్టడానికి కట్టుబడి ఉందని తెలిపింది.

Join WhatsApp

Join Now

Leave a Comment