వాణితో ఎమ్మెల్యే రాస‌లీల‌లు నిజ‌మే.. టీడీపీ నేత సూఫియా

వాణితో ఎమ్మెల్యే రాస‌లీల‌లు నిజ‌మే.. టీడీపీ నేత సూఫియా

ఇటీవ‌ల మ‌హిళ‌(Women)తో వీడియో కాల్(Video Call) మాట్లాడి త‌న ప్రాంతంతో పాటు రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ ప‌రిచ‌యం అయిన గుంటూరు(Guntur) ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) నసీర్ అహ్మద్‌ (Naseer Ahmed) పై ఆ పార్టీకి చెందిన ఒక మహిళా కార్యకర్త సూఫియా సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) వేధింపులు తాళ‌లేక ఆయ‌న కార్యాలయం ఎదుటే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నిస్తున్న సంద‌ర్భంలో ఎమ్మెల్యే – ఆ పార్టీ నాయ‌కురాలు వాణి మ‌ధ్య వివాహేత‌ర సంబంధం కొన‌సాగుతుంద‌న్న మాట వాస్త‌వమేన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి ముందు సూఫియా మీడియా ముందు మాట్లాడుతూ, టీడీపీ (TDP) మహిళా నాయకురాలు వాణి(Vani), ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌ల మధ్య ఎఫైర్ ఉందని వాణి (Vani) భర్త నవీన్ కృష్ణ (Naveen Krishna) తనకు చెప్పినట్లు వెల్లడించారు. నవీన్ కృష్ణ తన భార్య ఫోన్‌ను హ్యాక్ చేసి, ఆమె ఎమ్మెల్యేతో మాట్లాడిన కాల్స్, వీడియోలను రికార్డ్ చేసి వింటూ ఉండేవారని తెలిపారు. ఈ వీడియోలు నవీన్ కృష్ణ వద్ద ఉన్నాయని, తాను నాలుగు రోజుల క్రితం ఈ విషయంపై వీడియో చేసి బయట పెట్టినట్లు చెప్పారు.

తాను ఈ విషయాన్ని నేరుగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌కు చెప్పినప్పుడు, ఆయన రెండు రోజుల టైం అడిగారని సూఫియా పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు ఎమ్మెల్యే, వాణి, నవీన్ కృష్ణ అందరూ కలిసి ఈ వ్యవహారాన్ని తనపై నెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

పోలీసులు (Police) తమ కుటుంబ సభ్యులను తరచూ స్టేషన్‌కు పిలిచి వేధిస్తున్నారని, ఈ మానసిక ఒత్తిడి భరించలేక ఆత్మహత్యాయత్నం చేశానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వాణి భర్తను, వారి బంధువు విజయ్ కృష్ణ (Vijay Krishna) ను అదుపులోకి తీసుకుంటే అన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని సూఫియా డిమాండ్ చేశారు. ఈ ఘటన రాష్ట్ర‌ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం సూఫియా గుంటూరు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment