లిక్కర్ కేసులో రెండో ఛార్జ్‌షీట్‌.. వారే ఎందుకు కీల‌కం?

లిక్కర్ కేసులో రెండో ఛార్జ్‌షీట్‌.. వారే ఎందుకు కీల‌కం?

ఏపీ లిక్కర్ స్కాం (AP Liquor Scam) కేసులో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్)(SIT) 200 పేజీల రెండో ఛార్జ్‌షీట్‌ (Second Charge Sheet) ను ఏసీబీ కోర్టు (ACB Court)లో దాఖలు చేసింది. ఈ ఛార్జ్‌షీట్‌లో మాజీ (Former) సీఎం (CM) వైఎస్ జగన్ (YS Jagan) కార్యదర్శి (Secretary) ధనుంజయ్ రెడ్డి (Dhanunjay Reddy), ఓఎస్‌డీ (OSD) కృష్ణమోహన్ రెడ్డి (Krishnamohan Reddy), భారతీ సిమెంట్స్ (Bharathi Cements) డైరెక్టర్ (Director) బాలాజీ గోవిందప్ప (Balaji Govindappa) పాత్రపై కీలక ఆధారాలను పొందుప‌రిచిన‌ట్లుగా స‌మాచారం. మద్యం విధానం మార్పు, సిండికేట్ సమావేశాలు, ముడుపుల వ్యవహారం జరిగినట్లు నిర్ధారణకు వచ్చామని సిట్ అధికారులు కోర్టుకు ఛార్జ్ షీట్‌లో వెల్లడించారు. చార్జ్‌షీట్‌లోని అంశాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. కాగా, సిట్ నివేదిక‌పై వైసీపీ శ్రేణులు (YSRCP Cadres) అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నారు.

బెయిల్ వ‌స్తుంద‌నే కార‌ణంతోనేనా..?
మ‌ద్యం కేసు (Liquor Case) ఓ క‌ట్టుక‌థ అని, ధ‌నుంజ‌యరెడ్డి, కృష్ణ‌మోహ‌న్‌రెడ్డిల‌ను అరెస్టు చేసి 90 రోజులు గ‌డుస్తుండ‌డంతో టెక్నిక‌ల్‌ (Technical)గా వారికి బెయిల్ (Bail) వ‌స్తుంద‌నే కార‌ణంతో వారి ముగ్గురి పేర్ల‌ను కేసులో కీల‌కంగా మార్చింద‌ని ప్ర‌తిప‌క్ష వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. జ‌గ‌న్‌కు స‌న్నిహితులుగా, పార్టీలో కీల‌కంగా ఉన్న‌వారిని వేధించ‌డ‌మే కూట‌మి ప్ర‌భుత్వం టార్గెట్‌గా పెట్టుకుంద‌ని అంటున్నారు. సిట్ స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్ల విష‌యంలో, వెంక‌టేష్ నాయుడు (Venkatesh Naidu) సీఎం చంద్ర‌బాబు (CM Chandrababu), మంత్రి లోకేష్‌ (Lokesh)తో దిగిన ఫొటోల‌కు క్లారిటీ ఇవ్వ‌లేక‌పోయార‌ని, ఈ కేసు పూర్తిగా అక్ర‌మ‌మ‌ని, ఎలాంటి ఆధారాలు లేవ‌ని వైసీపీ శ్రేణులు అంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment