మ‌ళ్లీ ‘కాల్‌మనీ విష‌ సంస్కృతి’.. విజ‌య‌వాడ‌లో ‘జ్వాల ముఠా’ అరాచ‌కాలు?

మ‌ళ్లీ 'కాల్‌మనీ విష‌ సంస్కృతి'.. విజ‌య‌వాడ‌లో 'జ్వాల ముఠా' అరాచ‌కాలు?

2014-2019 మధ్య సంచలనం సృష్టించిన కాల్ మనీ (Call Money) సంస్కృతి (Culture) మళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. అధిక వడ్డీలకు అప్పులిచ్చి, తీర్చలేని వారిని, ముఖ్యంగా మహిళలను (Womens) బలవంతంగా లొంగదీసుకునే ఘటనలు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. ఇటీవ‌ల ఈ అరాచకాలు తిరిగి చెలరేగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “జ్వాల” ముఠా (Jwala Gang) నేతృత్వంలో నివాసాల మధ్యలో పేకాట డెన్‌లు, అందమైన యువతులను లొంగదీసేందుకు బెదిరింపులు, బలవంతంగా డబ్బులు లాక్కునే చర్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

స్థానికుల ఆరోపణల ప్రకారం.. ఈ కాల్ మనీ రాకెట్‌కు విజయవాడ (Vijayawada) తూర్పు నియోజకవర్గ టీడీపీ (TDP MLA) ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు (Gadde Rammohan Rao), ఆయన కుమారుడు గద్దె క్రాంతి (Gadde Kranti) అండదండలు ఉన్నాయని, జ్వాల వీరి ప్రధాన అనుచరుడిగా వ్యవహరిస్తున్నాడని తెలుస్తోంది. జ్వాల పేరు వినగానే యువత, ముఖ్యంగా మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారని, వీరు బెదిరింపుల ద్వారా అమాయకులను లొంగదీసుకుంటూ డబ్బులు గుంజుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2015లో కాల్ మనీ రాకెట్‌పై విజయవాడలో దాదాపు 1,827 ఫిర్యాదులు నమోదై, 188 మంది అరెస్టయిన ఘటన గుర్తుకు చేస్తోంది. అప్పట్లో ఈ రాకెట్‌లో టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రాగా, ప్రస్తుతం మళ్లీ ఇలాంటి ఆరోపణలు బయటపడుతున్నాయి. ఈ అరాచకాలు అధికార పార్టీ మద్దతు లేకుండా ఇంత బహిరంగంగా జరగడం సాధ్యం కాదని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ ఘటనలపై స్థానిక మహిళలు, యువత భయాందోళనలో ఉండగా, అమాయక ఆడపడుచులను ర‌క్షించాల‌ని తూర్పు నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ (Gautam Sawang) నేతృత్వంలో 2015లో కాల్ మనీ రాకెట్‌పై కఠిన చర్యలు తీసుకున్నట్లే, ప్రస్తుతం కూడా జ్వాల ముఠాపై దృష్టి సారించాలని, బాధితుల ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని స్థానిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. “మళ్లీ 2015 లాంటి దుర్గతి తలెత్తకూడదు, రాజకీయ ప్రమేయం ఉన్నా నేరస్తులను కఠినంగా శిక్షించాలి” అని ఒక స్థానిక మహిళా సంఘం నాయకురాలు అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment