జ‌డ్జిల‌పై రెచ్చిపోతున్న టీడీపీ శ్రేణులు.. అరిక‌ట్టేవారెవ‌రు..?

జ‌డ్జిల‌పై రెచ్చిపోతున్న టీడీపీ శ్రేణులు.. అరిక‌ట్టేవారెవ‌రు..?

త‌మ‌కు అనుకూల తీర్పు రాక‌పోతే న్యాయ‌మూర్తుల‌ను సైతం టార్గెట్ చేసే స్థాయికి వెళ్లిపోయింది ఏపీ రాజ‌కీయం. ఇటీవ‌ల తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) (టీడీపీ) సోషల్ మీడియా శ్రేణులు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలతో రెచ్చిపోతున్నాయి. జ‌డ్జిల‌కు (Judges) అవినీతి (Corruption) మ‌ర‌కలు అంటించే స్థాయికి వెళ్లిపోయారు. తీర్పులు చెప్పే న్యాయ‌మూర్తుల‌పై విమర్శలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాల‌నే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవ‌ల వైసీపీ నాయకుడు తురకా కిషోర్ (Turaka Kishore) విడుదలకు సంబంధించిన కోర్టు తీర్పును తప్పుబడుతూ, ఒక టీడీపీ (TDP) అనుకూల హ్యాండిల్ (Handle) “తెలీదు… గుర్తులేదు… మర్చిపోయాను” పేరుతో ఎక్స్‌లో జడ్జిని కించపరుస్తూ, “అమ్ముడుపోయారేమో” అని వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఈ ట్వీట్‌లో జడ్జి ఇంగిత జ్ఞానాన్ని, నీతిని ప్రశ్నిస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేయడం న్యాయవ్యవస్థ సమగ్రతపై తీవ్ర చర్చను రేకెత్తించింది. తీర్పు ఏ విధంగా చెప్పాలో కూడా ఆ వ్య‌క్తి జ‌డ్జిల‌కు సూచిస్తూ ట్వీట్ చేశాడు. అన్ని ప‌రిధులు దాటి న్యాయ‌మూర్తి అమ్ముడుపోయార‌ని వ్యాఖ్యానించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇటీవ‌ల వైసీపీ నేత‌ల బెయిల్ మంజూరు తీర్పుల విష‌యంలోనూ హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ (Justice) శ్రీనివాసరెడ్డి (Srinivas Reddy)పై కొందరు టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. జ‌స్టిస్ శ్రీ‌నివాస్‌రెడ్డి కులాన్ని, సర్వీస్ కాలాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే కొంద‌రు దూషణలకు దిగారు. ఇది న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యాన్ని దెబ్బతీసే చర్యగా విమర్శలు ఎదుర్కొంది. బార్ కౌన్సిల్ సైతం టీడీపీ దుశ్చ‌ర్య‌ను త‌ప్పుబ‌డుతూ ఒక‌రోజు విధుల‌ను బ‌హిష్క‌రించింది. ఈ వ్యాఖ్యలు జడ్జిల వ్యక్తిగత, వృత్తిపరమైన గౌరవాన్ని దిగజార్చడమే కాకుండా, ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని కుంటుపరిచే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇటువంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజకీయ విశ్లేషకులు, మేధావులు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియా వారియర్స్‌ను అరెస్టు చేయాలని, వారి ఇష్టారీతి వ్యాఖ్యలను అరికట్టకపోతే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. “న్యాయమూర్తులపై ఇలాంటి దాడులు జడ్జిల స్వతంత్రతను దెబ్బతీస్తాయి” అని ఒక న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇలాంటి సంఘటనలపై కంటెంప్ట్ కేసులు నమోదు చేసిన నేపథ్యంలో, ప్రస్తుత ఘటనపై కూడా పోలీసులు, కోర్టు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో న్యాయవ్యవస్థ స్థానం, సోషల్ మీడియా దుర్వినియోగంపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment