ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భార్య జైపూర్‌లో …

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భార్య జైపూర్‌లో ...

ఉక్రెయిన్ (Ukraine) అధ్యక్షుడు వోలోడిమిర్ (Volodymyr) జెలెన్‌స్కీ (Zelensky) సతీమణి, దేశ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్‌స్కీ (Olena Zelensky) జైపూర్‌(Jaipur)లో అనూహ్యంగా ప్రత్యక్షమయ్యారు. జపాన్‌ (Japan) ప్రయాణం మధ్యలో వారి విమానం తాత్కాలికంగా జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావడంతో ఈ కదలిక సంచలనం రేపింది.

విమానానికి ఇంధనం.. జైపూర్‌లో రెండు గంటల విరామం
ఉక్రెయిన్‌కు చెందిన 23 మంది ప్రతినిధులతో కూడిన బృందం జపాన్‌లోని టోక్యో (Tokyo) నగరానికి వెళ్తోంది. వారంతా ప్రయాణిస్తున్న స్పెషల్ ఫ్లైట్ ఆదివారం ఉదయం 6:30 గంటలకు జైపూర్‌లో ల్యాండ్ అయింది. విమానానికి ఇంధనం నింపడం కోసం ఈ విరామం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఉదయం 8:15కి విమానం తిరిగి బయలుదేరింది.

ప్రోటోకాల్ ప్రకారం ప్రత్యేక మర్యాదలు
ఈ పర్యటనలో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రే సిబిహా, ఐక్యరాజ్యసమితిలో శాశ్వత ప్రతినిధి సెర్గీ కిస్లిట్సా, ఆర్థిక వ్యవహారాల మంత్రి ఒలెక్సీ సోబోలెవ్ వంటి ప్రముఖులు ఉన్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ముందుగానే ఈ విమానానికి అనుమతి ఇచ్చింది. వీరందరికీ సివిల్ ఏవియేషన్ బృందం అన్ని వీఐపీ మర్యాదలు కల్పించింది. తనిఖీలు లేకుండా ప్రత్యేక లాంజ్‌లో సౌకర్యాలు అందించబడినట్లు సమాచారం.

జపాన్ పర్యటన వెనక కీలక లక్ష్యం
ఉక్రెయిన్ ప్రస్తుతం రష్యాతో కొనసాగుతున్న యుద్ధానికి అంతర్జాతీయ మద్దతు కోరుతూ పర్యటనలు నిర్వహిస్తోంది. జపాన్ పర్యటన కూడా అదే క్రమంలో భాగం. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి ఆర్థిక సహాయం కోరడమే కాకుండా, రష్యాపై ఒత్తిడి పెంచే విధంగా ఈ పర్యటనను ఉద్దేశించారు. భారత్ ఇప్పటికే యుద్ధానికి శాంతియుత పరిష్కారం కోరుతూ మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment