డ్రగ్స్, కాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై విజయ్ సేతుపతి సీరియస్!

డ్రగ్స్, కాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై విజయ్ సేతుపతి సీరియస్!

తమిళ స్టార్ (Tamil Star) హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కుకున్నారు. బ్రిటిష్ సైకియాట్రిస్ట్ డాక్టర్ రమ్య మోహన్ (Ramya Mohan) ఆయనపై డ్రగ్స్ (Drugs), కాస్టింగ్ కౌచ్ (Casting Couch) ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో సంచలన పోస్టులు చేశారు. సేతుపతి కొంత మంది మహిళలతో ‘కారవాన్ ఫేవర్’ కోసం డీల్ చేస్తాడని, ఒక యువతి ప్రస్తుతం రిహాబ్ సెంటర్‌ (Rehab Center)లో ఉందని ఆమె పేర్కొన్నారు. కొన్ని గంటల్లోనే ఆమె ఈ పోస్టులను తొలగించినప్పటికీ, అవి అప్పటికే వైరల్ అయ్యాయి.

ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి తీవ్రంగా స్పందించారు. “ఈ ఆరోపణల్లో కించిత్తు కూడా నిజం లేదు. ఇప్పటికే నా టీమ్ సైబర్ క్రైమ్ (Cyber Crime) శాఖలో ఫిర్యాదు చేసింది. నన్ను దగ్గర నుంచి చూసినవాళ్లకు ఈ ఆరోపణలు నవ్వు పుట్టించేలా ఉన్నాయి. అలాంటివి నాకు బాధ కలిగించవు, కానీ నా కుటుంబం, స్నేహితులు కలత చెందారు” అని ఆయన అన్నారు.

“ఆమె ప్రజా దృష్టిలోకి రావాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తుంది. ఈ రకమైన తప్పుడు ప్రచారాలు నేను గత ఏడేళ్లలో ఎన్నో చూశాను. అవి నా ప్రొఫెషనల్ లైఫ్ మీద ఎలాంటి ప్రభావం చూపలేవు. నాకు తెలుసు నిజం ఎప్పటికీ నిలబడుతుంది” అని విజయ్ సేతుపతి గట్టిగా స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment