ఫిల్మ్ ఛాంబర్‌లో గొడ‌వ‌.. “ఆంధ్రా గో బ్యాక్” నినాదాలు!

ఫిల్మ్ ఛాంబర్‌లో గొడ‌వ‌.. "ఆంధ్రా గో బ్యాక్" నినాదాలు!

హైదరాబాద్‌ (Hyderabad)లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ (Telugu Film Chamber) వద్ద తెలంగాణ వాదులు (Telangana Activists) ఆందోళనకు దిగారు. ఫిల్మ్ ఛాంబర్‌లో తెలంగాణ ఉద్యమకారుడు, సినీ ప్రముఖుడు పైడి జైరాజ్ (Paidi Jairaj) ఫోటోను చిన్నదిగా పెట్టారని నిరసనకారులు మండిపడ్డారు. నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్‌ (Prasanna Kumar)తో పాశం యాదగిరి (Pasham Yadagiri) వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా “ఆంధ్రా గో బ్యాక్” (Andhra Go Back) అంటూ నినాదాలు చేశారు. కావాలనే తెలంగాణకు చెందిన పైడి జైరాజ్ ఫోటోను చిన్నదిగా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సినారె ఫోటో ఎక్కడ?
అంతేకాకుండా, సినారె (సి.నారాయణ రెడ్డి) (C. Narayana Reddy) ఫోటో ఎందుకు పెట్టలేదని కూడా తెలంగాణ వాదులు ప్రశ్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేయడంతో గొడవ సద్దుమణిగింది.

నిర్మాతల మండలి మౌనం
ఈ వివాదంపై నిర్మాతల మండలి ఇప్పటివరకు స్పందించలేదు. సినీ పరిశ్రమ నుంచి కూడా పెద్దగా ఎవరూ దీనిపై స్పందించకపోవడం గమనార్హం. గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో తెలంగాణకు చెందిన వారిపై వివక్ష చూపిస్తున్నారంటూ పలువురు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా నిర్మాతల మండలి వద్ద జరిగిన ఈ గొడవ సినీ వర్గాల్లో సంచలనం రేపుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment