డెడ్‌హ్యాంగ్ ఛాలెంజ్‌తో అదరగొట్టిన సమంత!

ఫిట్‌నెస్ అంటే ఇదే! డెడ్‌హ్యాంగ్ ఛాలెంజ్‌తో అదరగొట్టిన సమంత!

అగ్ర కథానాయిక సమంత (Samantha) తన ఫిట్‌నెస్ (Fitness) పట్ల చూపే ఆసక్తి, అంకితభావం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే 100 కిలోల వెయిట్ లిఫ్టింగ్ (Weight Lifting) చేస్తూ షాక్‌కు గురి చేసిన సమంత, తాజాగా మరోసారి తన శారీరక సత్తాను నిరూపించారు. ఈసారి ఆమె డెడ్‌హ్యాంగ్ (Dead-Hang) ఛాలెంజ్ (Challenge) తీసుకుని 90 సెకన్ల పాటు కండిషనింగ్ పొజిషన్‌లో నిలబడి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ట్రైనర్ అద్భుతమైన సందేశం:
ఈ వీడియోను ఆమె ట్రైనర్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ, “మీరు ఎలా కనిపిస్తున్నారు అనే దాని కంటే, ఎవరూ చూడని సమయంలో మీరు ఎంత బలంగా ఉన్నారన్నదే నిజమైన విషయం” అంటూ ఓ అద్భుతమైన సందేశం ఇచ్చారు.

నెటిజన్ల ప్రశంసలు:
సమంత ‘Take 20 Health’ అనే పాడ్‌కాస్ట్ సిరీస్‌లో తరచుగా తన ఆరోగ్య, ఫిట్‌నెస్ ప్రయాణానికి సంబంధించిన అనుభవాలు పంచుకుంటూ ఫిట్‌నెస్ అవగాహనకు తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘సమంత స్ట్రాంగ్’, ‘రియల్ ఇన్స్పిరేషన్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తాజా ఛాలెంజ్‌తో మరోసారి బలంగా ఉండటం అంటే ఏమిటో చూపించింది సమంత. ఆమె ఫిట్‌నెస్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment