కేసీఆర్‌ను క‌లిసిన కేటీఆర్‌, హ‌రీష్‌.. ఎర్రవెల్లిలో కీలక భేటీ

కేసీఆర్‌ను క‌లిసిన కేటీఆర్‌, హ‌రీష్‌.. ఎర్రవెల్లిలో కీలక భేటీ

తెలంగాణ (Telangana) రాజకీయాలు (Politics) కాక‌పుట్టిస్తున్నాయి. ఈ తరుణంలో, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్)(KCR) ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో మంగ‌ళ‌వారం ఒక కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో ఆయన తన తనయుడు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు (Harish Rao) పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాల మధ్య జరిగిన ఈ సమావేశం కీలకమైన రాజకీయ మార్పుల‌ను సూచిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ భేటీలో ముఖ్యంగా మూడు ప్రధాన అంశాలపై చర్చ జరిగిన‌ట్లుగా స‌మాచారం. మొదటిది బీసీలకు 42% రిజర్వేషన్లు (Reservations) కల్పించే అంశం. ఇది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెండవది, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు- బీఆర్‌ఎస్‌(BRS)కు ఇది కీలక పరీక్షగా మారబోతోంది. మూడవది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సీటుపై కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో భేటీ జరిగినట్లు సమాచారం.

కేసీఆర్ ఈ సందర్భంగా సీనియర్ నాయకులు కేటీఆర్‌, హ‌రీష్‌రావుల‌కు పలు కీల‌క సూచనలు చేసినట్లు రాజకీయ వర్గాలు వెల్లడించాయి. ప్రజలతో నేరుగా మమేకం అయ్యేలా పనిచేయాలని, అభివృద్ధి, సంక్షేమ ఫలాలను గుర్తు చేసేలా వ్యూహాలు రూపొందించుకోవాలని సూచించినట్లు సమాచారం. అలాగే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అవ‌లంభిస్తున్న వైఖరిని ఎప్ప‌టిక‌ప్పుడు తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ఆయన సూచించిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం బీఆర్‌ఎస్ కీలక దశలోకి అడుగుపెడుతుందా? పార్టీలో వ్యూహాత్మక మార్పులు వస్తాయా? అనే చర్చలు ఇప్పుడు తెరమీదకొస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment