ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ స్టార్‌లింక్ (Starlink) సేవలపై భారత ప్రభుత్వ (Indian Government)ఆంక్షలు విధించింది. స్టార్ లింక్ భారత్‌లో సేవలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రభుత్వం షాకింగ్ నిర్ణయాన్ని వెల్లడించింది. ఇప్పటికే అవసరమైన లైసెన్సులు పొందిన ఈ సంస్థపై కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది.
ప్రాథమికంగా గ్రామీణ సేవలకే ప్రాధాన్యం
స్టార్‌లింక్ సేవల పరిమితి (Limitation) అంశంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmassani Chandrashekar) ఓ స్పష్టత ఇచ్చారు. స్టార్లింక్కి భారత్‌లో గరిష్ఠంగా 20 లక్షల కనెక్షన్లకు మాత్రమే అనుమతి ఇచ్చినట్టు మంత్రి పేర్కొన్నారు. “ఈ సేవలు ప్రధానంగా గ్రామీణ, వైదూర ప్రాంతాల్లో ఉన్న ఇంటర్నెట్లో విభేదాలు ఎదుర్కొంటున్న ప్రజలకు లక్ష్యంగా ఉంటాయి” అని తెలిపారు. అంతర్జాతీయంగా ఎంతో వేగంగా విస్తరిస్తున్న స్టార్‌లింక్‌కు ఈ పరిమితి కొంత ఆంక్షలా కనిపిస్తున్నా, దేశవ్యాప్తంగా కనెక్టివిటీ పెంపు దిశగా ఇది ఒక ముందడుగు కావచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
డిజిటల్ ఇండియాకి తోడ్పాటు..
స్టార్‌లింక్ రాకతో డిజిటల్ ఇండియా మిషన్కి మరింత వేగం లభిస్తుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశం. ఇప్పటికే జియో, ఎయిర్టెల్ లాంటి సంస్థలు 5G సేవలను విస్తృతంగా అందిస్తున్నా, ఇంకా ఎన్నో ప్రాంతాల్లో కనెక్టివిటీ లోపం ఉంది. అలాంటి సందర్భంలో స్టార్‌లింక్ సేవలు ఉపయుక్తం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే 20 లక్షల కనెక్షన్ల పరిమితి ఉండటంతో దీని వ్యాప్తిపై ప్రశ్నలు కొనసాగుతున్నాయి.








