హుజురాబాద్ (Huzurabad)లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy)కు మరోసారి చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ (Congress Party) తీవ్రంగా స్పందించింది. హుజురాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మ్యాకల తిరుపతి (Makala Tirupati) ఇచ్చిన ఫిర్యాదుతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ సంఘటన నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఎమ్మెల్యేపై అధికారికంగా ఫిర్యాదు చేశారు.
పోలీసులు బిఎన్‌ఎస్ చట్టంలోని సెక్షన్ 352, 353, 1(b), 353(2) కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. సీఎం పై వ్యాఖ్యలు రాజకీయంగా తలనొప్పిగా మారినట్లు ఈ ఘటనను పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.