కేంద్ర మాజీ మంత్రి (Central Former Minister), టీడీపీ (TDP) మాజీ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు (Pusapati Ashok Gajapathi Raju) గోవా గవర్నర్ (Goa Governor)గా బాధ్యతలు (Responsibilities) చేపట్టారు. గోవా(Goa) రాజ్‌భవన్ (Raj Bhavan)లోని దర్బార్ హాల్ (Darbar Hall)లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్, గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ ఎంపీలు, బీజేపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు హాజరయ్యారు.
74 ఏళ్ల అశోక్ గజపతిరాజు, విజయనగరం (Vizianagaram) రాజవంశానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, 2014-18 మధ్యలో కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రిగా పనిచేశారు. అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్‌గా నియమిస్తూ ఈనెల 14 రాష్ట్రపతి ప్రకటించారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడైన అశోక్ గజపతిరాజు, విజయనగరం నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, 2014లో ఎంపీగా గెలిచి, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా సేవలందించారు.








