విశాఖ (Visakhapatnam’s)లోని హార్బర్ డివిజన్ (Harbour Division)లో దారుణ ఘటన వెలుగుచూసింది. తమను రక్షించాలని వేడుకున్న పోలీసులు కూడా తమపైనే ఒత్తిడి తెస్తున్నారని బాధితులు కన్నీరుపెట్టుకుంటున్న సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. విశాఖలోని ఇంటర్మీడియట్ (Intermediate) చదువుతున్న మైనర్ బాలిక (Minor Girl)ను రామకృష్ణ (Ramakrishna) అనే యువకుడు గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. బాధితురాలిని బెదిరిస్తూ “నేను చెప్పినట్లుగా వినకపోతే నిన్ను చంపేస్తా” అంటూ ఇంటికే వచ్చి బెదిరింపులకు దిగాడు.
తమ కుమార్తెకు రామకృష్ణ నుంచి ప్రాణహాని ఉందని భావించిన తల్లిదండ్రులు హార్బర్ (Harbour) ఏసీపీ (ACP) కాళిదాసును (Kalidasu) ఆశ్రయించారు. అయితే పోలీసుల ద్వారా తమకు న్యాయం జరుగుతుందని ఆశించిన తల్లిదండ్రులకు కన్నీరు మిగిలింది. తమకు న్యాయం చేయాల్సిన ఏసీపీ కాళిదాసులు తమపైనే ఒత్తిడి తెస్తూ పోక్సో కేసు (POCSO Case)లో సెటిల్మెంట్కి వెళ్లాలని బెదిరింపులకు దిగుతున్నాడని ఆరోపించారు. పోలీస్ స్టేషన్లోనే నిందితుడు రామకృష్ణ, బాధితురాలి తండ్రిపై దాడికి తెగబడటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఈ ఘటనపై ఏసీపీ పనితీరు పట్ల బాధితుల కుటుంబం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఒకవైపు చట్టాన్ని ఆశ్రయించినప్పుడు కూడా రక్షణ లేకపోవడం, ఇంకోవైపు బాధితులే పోలీసుల చేతులమీద ఒత్తిడికి గురవ్వడం తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. బాధితులు న్యాయం కోసం ఉన్నతస్థాయి పోలీస్ అధికారుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.








