ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం.. 40 అంశాల‌తో అజెండా

ఏపీ కేబినెట్ ప్రారంభం.. 40 అంశాల‌తో అజెండా

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (State Cabinet Meeting) ప్రారంభమైంది. ఈసారి సమావేశం దాదాపు 40 అంశాలతో విస్తృత అజెండాపై జరగనుండటంతో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీ (Policy), ఎస్ఐపీబీ (SIPB) ద్వారా రూ.50 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం, సీఆర్డీఏ (CRDA) నిర్ణయాలు, లేఔట్ల క్రమబద్ధీకరణ చట్ట సవరణలు వంటి అంశాలు ఈ సమావేశానికి ప్రధాన అజెండాగా ఉన్నాయి.

వీఎంఆర్డీఏ (VMRDA) పరిధిలో భూసమీకరణ, నీటి సరఫరా, సీపేజీ నిర్వహణ ప్యాకేజీలు, ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్ షిప్‌ల లేఔట్లపై కమిటీ సిఫార్సులు, వార్డు వెల్ఫేర్ కార్యదర్శుల పోస్టుల అప్‌గ్రేడ్, మొత్తం 815 పోస్టుల అప్‌గ్రేడ్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే విద్యుత్‌, జలవనరుల శాఖల్లోని పనులు, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతి డిక్లరేషన్ అంశాలు కూడా చర్చకు రానున్నాయి.

పొగాకు రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వ నిర్ణయం, తిరుపతిలో ఇటీవల జరిగిన తొక్కిసలాటపై కమిటీ నివేదిక ఆమోదం, జడ్జిలకు డ్రైవర్ల కేటాయింపు, నూర్ బాషా దూదేకుల అభివృద్ధి కార్పొరేషన్ మార్పులపై చర్చలు మంత్రివర్గ సమావేశానికి చేరనున్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి మల్టీ-సెక్టోరల్ అంశాలపై కీలకంగా ఈ సమావేశం దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment