ధన్‌ఖడ్ రాజీనామా ఆమోదం.. జైరాం రమేష్ ఆస‌క్తిక‌ర ట్వీట్‌

ధన్‌ఖడ్ రాజీనామా ఆమోదం.. జైరాం రమేష్ ఆస‌క్తిక‌ర ట్వీట్‌

జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) రాజీనామా (Resignation)ను రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆమోదించారు. సోమవరం అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి ధన్‌ఖడ్ (Dhankhar) రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతికి లేఖ పంపారు. మంగళవారం ధన్‌ఖడ్ రాజీనామా ఆమోదించినట్లు రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. ధన్‌ఖడ్ రాజీనామా తర్వాత ప్రధాని మోడీ (Modi) కీలక ట్వీట్ చేశారు. ధన్‌ఖడ్ ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సభా కార్యకలాపాలను ధన్‌ఖడ్ బాగానే నిర్వహించారు. ఎంపీలతో కూడా సమావేశం అయ్యారు. అయితే సాయంత్రానికి ఊహించని షాకిచ్చారు. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినట్లుగా వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా రాజకీయా పార్టీలు షాక్‌కు గురయ్యారు. ఇంత సడన్‌గా రాజీనామా చేయడమేంటి? అని చర్చ నడిచింది.

అయితే ధన్‌ఖడ్ రాజీనామాపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదో బలమైన కారణంతోనే రాజీనామా చేశారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పార్టీ పెద్దలు అవమానించడం వల్లే ఇంత వేగంగా ధన్‌ఖడ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇక తదుపరి ఉపరాష్ట్రపతిగా డిప్యూటీ ఛైర్మన్, జేడీయూ నేత హరివంశ్ (Harivansh) ఉపరాష్ట్రపతి అవ్వొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment