ఎన్టీఆర్ (NTR), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) బ్యానర్ (Banner)లో నాగవంశీ (Naga Vamsi) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ప్రకటన వాయిదాకు కారణం
నిర్మాత నాగవంశీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా ప్రకటన గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ముందుగా ఒక స్కేల్‌లో ప్రకటన చేయాలని మేము భావించాం. కానీ ఇటీవల బాలీవుడ్ నుండి విడుదలైన రామాయణం గ్లిమ్స్ (Ramayana Glimpses) చూశాక మా ప్లాన్‌లను మార్చుకున్నాం” అని ఆయన అన్నారు. తమ బ్యానర్‌లో త్రివిక్రమ్ మొదటిసారి పౌరాణిక సినిమా చేస్తుండటం, అలాగే సీనియర్ ఎన్టీఆర్ (రాముడిగా, కృష్ణుడిగా)ను చూసిన తనకు జూనియర్ ఎన్టీఆర్‌ను దైవ పాత్రలో చూపించే అవకాశం రావడంతో ప్రకటన మరింత గ్రాండ్‌గా ఉండాలని భావిస్తున్నట్లు నాగవంశీ పేర్కొన్నారు. “రామాయణం గ్లిమ్స్‌ను భారతదేశం మొత్తం మాట్లాడుకున్నారు. ఇప్పుడు మనం చేయబోయే సినిమా ప్రకటన అంతకు మించి మాట్లాడుకోవాలి” అనే ఉద్దేశ్యంతో త్రివిక్రమ్ మరికొంత సమయం తీసుకుని ప్రకటన చేద్దామని సూచించారని నాగవంశీ తెలిపారు.
చిత్రీకరణ ఎప్పుడు?
ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే తారక్‌తో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు నిర్మాత నాగవంశీ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, వచ్చే ఏడాది రెండో సగంలో త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని నాగవంశీ వెల్లడించారు.