గుడ్‌ న్యూస్.. శ్రీలంకతో సిరీస్‌కు బీసీసీఐ ప్లాన్!

ఆ అభిమానులకు గుడ్‌ న్యూస్.. ఆగస్ట్‌లో శ్రీలంకతో సిరీస్‌కు బీసీసీఐ ప్లాన్!

దౌత్యపరమైన కారణాలతో భారత్-బంగ్లాదేశ్ (India-Bangladesh) సిరీస్ (Series) వాయిదా (Postponed) పడటంతో, ఆగస్టులో టీమిండియా ఖాళీగా ఉండనుంది. ఈ ఖాళీని పూడ్చేందుకు బీసీసీఐ (BCCI) శ్రీలంక క్రికెట్ బోర్డు (Sri Lanka Cricket Board)తో చర్చలు జరుపుతోంది. ఆగస్టులో భారత్, శ్రీలంక మధ్య మూడు వన్డేలు (Three ODIs), మూడు టీ20 (Three T20s)లతో కూడిన సిరీస్ నిర్వహించేందుకు ప్లాన్(Plan) చేస్తున్నట్లు సమాచారం.

ఈ ప్రతిపాదనకు శ్రీలంక బోర్డు అంగీకరిస్తే, త్వరలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆగస్టులో జరగాల్సిన లంక ప్రీమియర్ లీగ్ కూడా వాయిదా పడటంతో శ్రీలంకకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఈ సిరీస్ ప్రతిపాదనతో రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు దిగ్గజాలు, ఈ వన్డే సిరీస్‌లో ఆడతారని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సిరీస్ సాధ్యాసాధ్యాలపై, అలాగే రోహిత్, కోహ్లీల భాగస్వామ్యంపై మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.

ఒకవేళ ఈ సిరీస్ సాధ్యపడకపోతే, రోహిత్, కోహ్లీలను మళ్ళీ అక్టోబర్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో చూడొచ్చు. రోహిత్, కోహ్లీ చివరిగా ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో కలిసి ఆడారు.

Join WhatsApp

Join Now

Leave a Comment