బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అధినేత (Chief), తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) స్వల్ప అనారోగ్యంతో హైదరాబాద్ (Hyderabad) సోమాజీగూడ (Somajiguda) యశోద ఆస్పత్రి (Yashoda Hospital)లో చికిత్స పొందుతున్నారు. గురువారం సాయంత్రం ఆయన అస్వస్థతకు గురికావడంతో వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరారు.
శుక్రవారం, కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ (MLC) కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఆస్పత్రికి వెళ్లి తండ్రిని పరామర్శించారు. అనంతరం కేసీఆర్కు చికిత్స అందిస్తున్న వైద్య బృందంతో ఆమె చర్చించారు. వైద్య పరీక్షల అనంతరం బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం, సోడియం స్థాయిలు తగ్గిపోవడం గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. వీటిని సమతుల్యం చేసే చికిత్సను వారు అందిస్తున్నారని వెల్లడించారు.
గురువారం రాత్రి వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో “కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. ఆయనపై నిశిత పర్యవేక్షణ కొనసాగుతోంది” అని పేర్కొన్నారు.