ఇంగ్లండ్ (England)తో జరుగుతున్న రెండో టెస్టు (Second Test)లో టీమిండియా (Team India) కెప్టెన్ (Captain) శుబ్‌మన్ గిల్ (Shubman Gill) అదరగొడుతున్నాడు. తొలిరోజే శతకం (Century) పూర్తి చేసుకున్న ఈ యువ కుడిచేతి వాటం బ్యాటర్, గురువారం నాటి రెండో రోజు ఆటలో 150 పరుగుల మార్కును అందుకున్నాడు. గిల్ ఈ స్కోరును 263 బంతుల్లో 17 ఫోర్ల సాయంతో సాధించాడు.
విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు
ఈ ఇన్నింగ్స్‌తో గిల్, టీమిండియా దిగ్గజ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానం (Edgbaston Stadium)లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత క్రికెటర్‌గా శుబ్‌మన్ గిల్ అవతరించాడు. ఇంతకుముందు 2018లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ ఇదే వేదికపై 149 పరుగులు చేశాడు. తాజాగా గిల్ కోహ్లీని అధిగమించి ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర తిరగరాశాడు. టెస్టుల్లో గిల్ 150 పరుగుల (150 Run) మార్కుకు చేరుకోవడం ఇదే తొలిసారి.
భారత రెండో కెప్టెన్‌గా గిల్
ఇంగ్లండ్ గడ్డపై టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్‌లో నూట యాభైకి పైగా వ్యక్తిగత స్కోరు సాధించిన టీమిండియా రెండో కెప్టెన్‌గానూ గిల్ నిలిచాడు. ఇంతకుముందు 1990లో ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్ హోదాలో 179 పరుగులు సాధించాడు.
మూడో సారథిగా అరుదైన ఘనత
అదేవిధంగా, 26 ఏళ్ల వయస్సు అడుగుపెట్టకముందే టెస్టు ఇన్నింగ్స్‌లో 150 పరుగుల మార్కు దాటిన భారత మూడో కెప్టెన్‌గానూ గిల్ చరిత్రకెక్కాడు. అతడి కంటే ముందు మన్సూర్ అలీఖాన్ పటౌడీ రెండుసార్లు ఈ ఘనత సాధించగా, సచిన్ టెండుల్కర్ కూడా ఈ ఫీట్‌ను నమోదు చేశాడు.