పాన్ ఇండియా సూపర్ స్టార్ (Super Star) ప్రభాస్ (Prabhas) నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab) కోసం రెబల్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ‘సలార్, కల్కి’ వంటి భారీ విజయాల తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ హారర్ థ్రిల్లర్ కామెడీ చిత్రాన్ని మారుతి తెరకెక్కిస్తున్నారు.
‘ది రాజా సాబ్’లో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఆయన సరసన నిధి అగర్వాల్ (Nidhi Agarwal), మాళవికా మోహనన్ (Malavika Mohanan), రిద్ధి కుమార్ (Ridhi Kumar) హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇటీవలే విడుదలైన టీజర్ (Teaser) కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందింది. ఈ టీజర్‌లో మారుతి, ప్రభాస్‌ను అభిమానులు చూడాలనుకున్న వింటేజ్ లుక్‌లో చూపించారు. హారర్ కంటెంట్‌తో పాటు మారుతి మార్క్ కామెడీ కూడా ఈ సినిమాలో అదిరిపోతుందని టీజర్ స్పష్టం చేస్తోంది.
స్పెషల్ సాంగ్‌లో కరీనా కపూర్!
తాజా సమాచారం ప్రకారం, ‘ది రాజా సాబ్’ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ (Special Song) కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్, స్టార్ హీరో సతీమణి కరీనా కపూర్ (Kareena Kapoor)ను చిత్ర యూనిట్ సంప్రదించిందని తెలుస్తోంది. ప్రభాస్‌కు బాలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న ‘రాజా సాబ్’కు మరింత మైలేజ్ తీసుకురావాలని మారుతి ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇందుకు కరీనా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్, కరీనా కపూర్ కాంబినేషన్‌లో వచ్చే ఈ స్పెషల్ సాంగ్ థియేటర్లను దద్దరిల్లజేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.