‘ల‌వ‌ర్‌ని హత్య చేసి ఇంట్లో దాచి.. ఫ్రెండ్స్‌తో మందు పార్టీ’

ప్రియురాలిని హత్య చేసి ఇంట్లోనే ఉంచి.. భోపాల్‌లో సంచలనం!

భోపాల్‌ (Bhopal)లో జరిగిన ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రియురాలిని (lover) హత్య (Murder) చేసిన ఓ వ్యక్తి, ఆపై స్నేహితుడితో కలిసి మద్యం పార్టీ (Alcohol Party) చేసుకున్నాడు. మద్యం మత్తులో తాను చేసిన నేరాన్ని బయటపెట్టడంతో అసలు విషయం బయటపడింది.

రితికా సేన్ (Ritika Sen) (29), సచిన్ రాజ్‌పుత్ (Sachin Rajput) (32) భోపాల్‌లో ఒక అద్దె ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. గత నెల 27న వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన సచిన్, రితికా గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి, తాడుతో కట్టి ఇంట్లోనే వదిలేశాడు.

రితికా మృతదేహం ఇంట్లో ఉండగానే, సచిన్ ఒక స్నేహితుడితో కలిసి మద్యం పార్టీ చేసుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న సచిన్, తాను రితికాను చంపి ఇంట్లో ఉంచినట్లు స్నేహితుడికి చెప్పాడు. అయితే, మొదట స్నేహితుడు అతని మాటలను నమ్మలేదు. మరుసటి రోజు ఉదయం స్నేహితుడు సచిన్ ఇంటిని పరిశీలించగా, రితికా మృతదేహం కనిపించింది. వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కుళ్లిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సోమవారం సాయంత్రం నిందితుడు సచిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఇంట్లో కీలక ఆధారాలు సేకరించారు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment